News May 23, 2024
రీపోలింగ్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
AP: సత్తెనపల్లి, చంద్రగిరిలోని పలు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ అంబటి రాంబాబు, మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను నేడు హైకోర్టు విచారించనుంది. సత్తెనపల్లిలోని 236, 237, 253, 254 బూత్‌లు, చంద్రగిరిలోని 4 కేంద్రాల్లో TDP నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. వైసీపీ ఏజెంట్లపై దాడులు చేశారని తెలిపారు. ఈసీ, సీఈవోతోపాటు పలువురు అధికారులు, టీడీపీ నేతలను ప్రతివాదులుగా చేర్చారు.
Similar News
News January 11, 2025
మస్క్ పిచ్చివాడవుతున్నారు: బయోగ్రఫీ రచయిత
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఉండేకొద్దీ పిచ్చివాడవుతున్నారని ఆయన జీవిత కథ రాస్తున్న అబ్రామ్‌సన్ ఆరోపించారు. మస్క్ మానసిక ఆరోగ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘మస్క్‌కు పిచ్చి ఎక్కుతోందని నేను బలంగా నమ్ముతున్నాను. ఆయన బయోగ్రాఫర్‌గా గడచిన రెండేళ్లుగా మస్క్ ఆన్‌లైన్ ప్రవర్తన నిశితంగా చూస్తున్నాను. భారీగా డ్రగ్స్ వాడకం, ఒత్తిడి కారణంగా ఎలాన్‌కు లోలోపల ఏదో తేడా చేసింది’ అని ట్వీట్ చేశారు.
News January 11, 2025
ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూర్‌కు ప్రధాని మోదీ
వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వెల్లడించారు. ఆ నెల 11, 12 తేదీల్లో జరిగే ఏఐ సదస్సులో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా గత ఏడాదిన్నరలో మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది రెండోసారి. గతంలో 2023 జులైలో ఆయన అక్కడ పర్యటించారు. ఆ తర్వాత 2024 రిపబ్లిక్ వేడుకలకు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ విశిష్ఠ అతిథిగా భారత్‌కు వచ్చారు.
News January 11, 2025
జనవరి 11: చరిత్రలో ఈరోజు
* 1922: మధుమేహ బాధితులకు ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చిన రోజు
* 1944: జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సోరెన్ జననం
* 1966: భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మరణం(ఫొటోలో)
* 1973: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పుట్టినరోజు
* 2008: పర్వతారోహకుడు ఎడ్మండ్ హిల్లరీ మరణం