News May 23, 2024

అనంతపురం జిల్లాకు పరిశీలకులుగా ముగ్గురు ఐఏఎస్ అధికారులు

image

అనంతపురం జిల్లాకు ముగ్గురు ఐఏఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ సందర్భంగా ప్రత్యేక అధికారులుగా అనంతపురం అర్బన్, రాప్తాడు నియోజకవర్గాలకు మనీష్ సింగ్, ఉరవకొండ, కళ్యాణదుర్గం, శింగనమలకు అజయ్ నాథ్, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాలకు అజయ్ కుమార్ పరిశీలకులుగా వ్యవహరించనున్నారు.

Similar News

News February 28, 2026

అనంత: హాకీలో సత్తా చాటిన యువకుడు యువన్ క్రిష్

image

అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో జరిగిన హాకీ టోర్నమెంట్‌లో యువకుడు యువన్ క్రిష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న యువన్ క్రిష్ అండర్ 10 హాకీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. భవిష్యత్తులో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని పాఠశాల హెచ్ఎం నారాయణ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

News February 28, 2026

కార్డుదారుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: జేసీ

image

అనంతపురం జిల్లాలోని 6,74,333 రైస్ కార్డుదారులకు సరిపడా నిత్యావసర సరుకులు చౌక ధరల దుకాణాలకు కేటాయించినట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ఉదయం & సాయంత్రం వేళల్లో రేషన్ షాపుల వద్దనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డీలర్లకు ఆయన సూచించారు. కార్డుదారులు తమకు దగ్గరలో ఉన్న ఏ చౌక ధరల దుకాణం వద్దనైనా నిత్యావసర సరుకులను పోర్టబిలిటీ ద్వారా పొందవచ్చన్నారు.

News February 28, 2026

పింఛన్ పంపిణీలో కలెక్టర్ ఆనంద్

image

అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లిలో ‘ఎన్టీఆర్ భరోసా’ పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి కలెక్టర్ స్వయంగా నగదు అందజేశారు. గ్రామస్థులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.