News May 23, 2024

కోహ్లీ IPL ట్రోఫీకి అర్హుడు.. RCBని వీడాలి: KP

image

ఎలిమినేటర్‌లో RCB ఓటమిపై స్పందిస్తూ ఇంగ్లండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ పీటరన్స్.. కోహ్లీ IPL ట్రోఫీకి అర్హుడని, అతడు RCBని వీడాలని కోరారు. ‘గతంలో చెప్పా, మళ్లీ చెబుతున్నా.. గొప్ప ఆటగాళ్లు జట్లను వీడి కీర్తి గడించారు. కోహ్లీ ఈసారీ ఆరెంజ్ క్యాప్ సాధించారు. అయినా జట్టు ఫెయిలైంది. అతడు హోమ్ టీమ్ ఢిల్లీలో చేరాలి’ అని KP అన్నారు. ఈ సీజన్‌లో కోహ్లీ 741రన్స్‌తో టాప్ స్కోరర్‌గా ఉన్న విషయం తెలిసిందే.

Similar News

News April 18, 2026

మరో ఆపరేషన్ సిందూర్‌కు గెట్ రెడీ: సీడీఎస్

image

ఆపరేషన్ సిందూర్ నెక్స్ట్ ఫేజ్‌కు భారత దళాలు సిద్ధంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పిలుపునిచ్చారు. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం ఇంకా మెరుగవ్వాలని సూచించారు. ఆపరేషన్స్‌లో పైచేయి సాధించేందుకు ఆర్మీ సమాచార సేకరణపై దృష్టిపెట్టిందన్నారు. OPSకు త్వరలో ఏడాది (మే 7) పూర్తికానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 18, 2026

బీజేపీ నుంచే అత్యల్పంగా మహిళా ఎంపీలు: మహువా

image

మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంతో విపక్షాలపై PM మోదీ సహా BJP నేతలు చేస్తున్న విమర్శలకు TMC MP మహువా మొయిత్రా Xలో కౌంటరిచ్చారు. లోక్‌సభలో BJP నుంచే అత్యల్పంగా మహిళా MPలు(240 మందిలో 31 మంది.. 12.90%) ఉన్నారని గుర్తు చేశారు. తమ పార్టీ నుంచి గెలిచిన 29 మంది MPల్లో 11 మంది మహిళలు(37.90%) అని పేర్కొన్నారు. ఇప్పుడున్న 543 సీట్లకు ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయకుండా ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు.

News April 18, 2026

‘పదహారణాల’ తెలుగమ్మాయి అంటే?

image

అచ్చమైన తెలుగు సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తే పదహారణాల తెలుగమ్మాయి అని అంటాం. ఒక కంప్లీట్ ఉమెన్ అని అర్థం. పూర్వం 16 అణాలు కలిస్తే ఒక పూర్తి రూపాయి. తన భాష, భావన, నడక, నడత, ఆహార్యం, వస్త్ర ధారణ తదితర 16 అంశాల్లో తెలుగుదనాన్ని నింపుకున్న అమ్మాయిని మన కవులు ఇలా పోల్చారు.
* ఒక బేడా= 2 అణాలు. ఒక పరకా=1/2 అణా, ఒక కాని=1/4 అణా, ఒక దమ్మిడి= 1/12 అణా.
<<-se>>#EPICSAYINGS<<>>