News May 23, 2024
పుంగనూరు: బీసీవై మద్దతుదారుపై దాడి
బీసీవై పార్టీ మద్దతుదారుపై వైసీపీ నాయకులు దాడి చేసినట్టు బాధితురాలు ఆరోపించింది. బర్నేపల్లి గ్రామానికి చెందిన శంకర్ భార్య అంజమ్మపై అదే గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులు చంద్రశేఖర్, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ బుధవారం కత్తితో దాడి చేసి గాయపరిచారని ఆమె ఆరోపించింది. ఆమె భర్త శంకర్ ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల కేసులో సబ్ జైల్లో ఉన్నారు. సీఐ రాఘవరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 13, 2025
కాలినడకన తిరుమలకు చేరుకున్న ఇండియా క్రికెటర్
భారత క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. నితీశ్ రాత్రికి తిరుమలలో బస చేసి మంగళవారం ఉదయం వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.
News January 13, 2025
తిరుపతి: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కర్ణాటక రాయల్పాడు వద్ద ఆదివారం రాత్రి రెండు కార్లు ఢీకొనడంతో తిరుపతికి చెందిన ప్రకాశ్, కడపకు చెందిన టీచర్ మారుతి శివకుమార్ మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. తిరుపతి కట్టకిందపాలెంకు చెందిన ప్రకాశ్ (55) అశోకనగర్లో ఉండే ఆనంద్‌తో కలిసి బెంగళూరు వెళ్లాడు. ఆదివారం వారు వస్తుండగా రాయల్పాడు వద్ద కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. టీచర్ మృతదేహాన్ని శ్రీనివాసపురానికి తరలించారు.
News January 13, 2025
‘ఎస్వీయూ వీసీ పోస్ట్ బీసీలకు ఇవ్వాలి’
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ పోస్టును బీసీలకు ఇవ్వాలని బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కేతే నారాయణస్వామి డిమాండ్ చేశారు. తిరుపతిలో ఆదివారం బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది. నారాయణస్వామి మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర జనాభాలో బీసీలు 60 శాతం పైగా ఉన్నారని చెప్పారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సగం కేటాయించాలని డిమాండ్ చేశారు.