News May 23, 2024

జూన్ 5 తర్వాత BRS దుకాణం బంద్: కోమటిరెడ్డి

image

TG: ఎన్నికల ఫలితాల తర్వాత జూన్ 5న బీఆర్ఎస్ దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆ పార్టీ కార్యకర్తలే నేతలను వెంటపడి కొడతారని ఎద్దేవా చేశారు. ‘పదేళ్లపాటు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అడ్డగోలుగా దోచుకుంది. అది చాలక కేసీఆర్ కుటుంబం ఢిల్లీకి కూడా వెళ్లింది. ఏం అవినీతి చేయకుండానే కవితపై 8 వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేశారా?’ అని ఆయన ప్రశ్నించారు.

Similar News

News April 19, 2026

నితీశ్ బౌలింగ్ వెనుక స్టీఫెన్ జోన్స్?

image

తన బౌలింగ్ మెరుగవడం వెనుక ఓ స్పెషల్ పర్సన్ ఉన్నారని, ఆయనెవరో ఇప్పుడే చెప్పనని ఇటీవల ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ తెలిపారు. అయితే బౌలింగ్ కోచ్ స్టీఫెన్ జోన్స్(UK) పర్యవేక్షణలో NKR ట్రైనింగ్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులోని పదుకొణె-ద్రవిడ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌లో వారంపాటు ఈ సెషన్ జరిగినట్లు సమాచారం. నితీశ్ స్పీడ్ గతంలో 120-125Kmph ఉండగా ఇప్పుడు 135-139Kmph వేస్తూ వికెట్లు తీస్తున్నారు.

News April 19, 2026

భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై రేపటి నుంచి చర్చలు!

image

USతో ట్రేడ్ డీల్ తొలి ఫేజ్ అమలుపై భారత్ ఆ దేశంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు చర్చలు జరపనుంది. ట్రంప్ టారిఫ్స్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత తొలిసారిగా భారత్ బృందం వాషింగ్టన్‌కు చర్చలకు వెళ్లనుంది. దీంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ సహా 16 దేశాల వాణిజ్యంపై ట్రంప్ దర్యాప్తునకు ఆదేశించడంపైనా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా USకు 10% టారిఫ్ చెల్లిస్తోంది.

News April 19, 2026

పండ్లకు స్ట్రిప్ పేపర్ టెస్ట్.. ఎలా చేస్తారు?

image

‘కాల్షియం కార్బైడ్’ వాడకంపై FSSAI కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే మామిడి, అరటి, బొప్పాయి షాపుల్లో తనిఖీలు నిర్వహించాలని రాష్ట్రాలను <<19672510>>ఆదేశించింది.<<>> స్ట్రిప్ పేపర్ టెస్ట్ చేయాలని సూచించింది. ఇందుకోసం పొటాషియం పర్మాంగనేట్‌తో శుద్ధి చేసిన పేపర్ లేదా రియాక్టివ్ స్ట్రిప్స్‌ను వాడతారు. దీన్ని పండ్లపై పెట్టగానే రంగు మారితే కృత్రిమంగా పండించే కెమికల్స్ ఉపయోగించినట్లు. ఈ స్ట్రిప్స్ ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి.