News May 23, 2024

WGL: దగ్గర పడుతున్న గడువు.. ఊపందుకున్న ప్రచారం

image

NLG-KMM-WGL పట్టభద్రుల MLC ఉప ఎన్నికల ప్రచార గడువు శనివారంతో ముగియనుంది. దీంతో BRS, BJP, INC పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అన్ని పార్టీల్లోని రాష్ట్ర స్థాయి నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతు కూడగడుతున్నారు. ఈ ఎన్నికకు సోమవారం పోలింగ్ జరగనుంది. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

Similar News

News December 27, 2025

WGL: గ్రామ పాలనలో మహిళా శక్తి!

image

జీపీ ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్‌తో జిల్లాలో 316 జీపీలకు ఎన్నికలు జరగగా 158 మంది మహిళలు సర్పంచులుగా గెలిచారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళామణులు తమ సత్తా చాటుకున్నారు. ఇక సర్పంచ్ స్థానాల్లో మగవారు నిలిచిన చోట ఉప సర్పంచ్ మహిళలకు, మహిళలు ఉన్న చోట మగవారికి అవకాశం వచ్చింది. పాలనపై పట్టులేకున్నా, కుటుంబ బాధ్యతలతో పాటు గ్రామాభివృద్ధి బాధ్యతను మోస్తామని మహిళా సర్పంచులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

News December 26, 2025

WGL: మహిళా సంఘాల ఖాతాల్లో రూ.6.50 కోట్లు జమ

image

వరంగల్ జిల్లాలో రుణాలు సకాలంలో చెల్లించిన స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మొత్తాన్ని తిరిగి చెల్లించింది. వడ్డీలేని రుణాల పథకం కింద 11 మండలాలకు రూ.6.50 కోట్లు విడుదల చేసి 7,540 సంఘాల ఖాతాల్లో జమ చేసింది. 2025-2028 రుణాలపై ఈ వడ్డీ రాయితీ వర్తించింది. అత్యధికంగా సంగెం మండలానికి రూ.79.52 లక్షలు, అత్యల్పంగా నెక్కొండకు రూ.76,958 లభించింది. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News December 24, 2025

వర్ధన్నపేట: ఏటీఎంలో కేటుగాడు

image

వర్ధన్నపేట ఎస్‌బీఐ బ్యాంకు ఏటీఎం వద్ద రైతు పిన్నింటి కిషన్‌రావు మోసానికి గురయ్యాడు. నగదు తీసుకునేందుకు వెళ్లిన సమయంలో దుండగుడు అతని ఏటీఎం కార్డును మార్చి రూ.40 వేల నగదు కాజేశాడు. గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మోసగాడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.