News May 23, 2024
‘సెన్సెక్స్ 30’లోకి అదానీ ఎంట్రీ.. విప్రో ఔట్!
BSE సెన్సెక్స్ టాప్ 30 స్టాక్స్‌లో విప్రో స్థానాన్ని అదానీ ఎంటర్‌ప్రైజెస్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ ఎంట్రీతో మార్కెట్‌లోకి $118 మిలియన్ల (రూ.982కోట్లు) ఫండ్స్ రావొచ్చని IIFL ఆల్టర్నేటివ్ రీసెర్చ్ వెల్లడించింది. మరోవైపు విప్రో వైదొలిగితే $56 మిలియన్లు (రూ.466కోట్లు) కోల్పోవచ్చని అంచనా వేసింది. అదానీ గ్రూప్ నుంచి ‘సెన్సెక్స్ 30’లో చేరిన తొలి కంపెనీగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ నిలవనుంది.
Similar News
News December 27, 2024
నన్ను అల్లు అర్జున్‌తో పోల్చవద్దు: అమితాబ్
‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. తాజాగా KBCలో తాను అల్లు అర్జున్, అమితాబ్ ఫ్యాన్ అని ఓ కంటెస్టెంట్ చెప్పారు. దీనికి అల్లు అర్జున్ అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడని, ఈ గుర్తింపునకు అతను అర్హుడని పేర్కొన్నారు. తాను కూడా పుష్ప-2తో AAకు అభిమానిని అయ్యానని చెప్పారు. ఆయనతో తనను పోల్చవద్దని బిగ్ బీ పేర్కొన్నారు.
News December 27, 2024
GREAT: 90 ఏళ్ల వయసులో వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటేశారు!
గతేడాది కేంద్రం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను పొడిగించేందుకు ‘ఢిల్లీ సర్వీసెస్ బిల్లు’ను రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పాసైతే ఢిల్లీ అధికారాలు కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని, అడ్డుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థించారు. 90 ఏళ్ల వయసు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా వీల్‌ఛైర్‌లో వచ్చి ఓటు వేశారు. మన్మోహన్ అంకితభావాన్ని ప్రధాని మోదీ సైతం కొనియాడారు.
News December 27, 2024
షాకింగ్: మీ సేవ పేరుతో నకిలీ వెబ్‌సైట్
TG: సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ విజృంభిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ప్రభుత్వ సైట్ meeseva.telangana.gov.in కాగా meesevatelangana.in పేరుతో నకిలీది సృష్టించారు. కొత్తగా మీ సేవ కేంద్రాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామంటూ HYD కలెక్టర్ పేరుతో ఫేక్ ఉత్తర్వులు రూపొందించారు. అది చూసి చాలా మంది ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశారు. ఈ స్కామ్‌పై సైబర్ సెల్ దర్యాప్తు చేస్తోంది. నకిలీ సైట్‌ను బ్లాక్ చేసింది.