News May 23, 2024

సీఎంకు రైతుల కంటే ఎన్నికలే ముఖ్యం: కిషన్ రెడ్డి

image

TG: రైతుల పట్ల కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి జిల్లా రాఘవపురంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. 45 రోజులైనా ధాన్యం కేంద్రంలోనే ఉన్నాయని పలువురు రైతులు చెప్పడంతో ఆయన ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌కు రైతుల కంటే ఎన్నికలే ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యమని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Similar News

News December 27, 2024

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. నిన్న 59,564 మంది స్వామివారిని దర్శించుకోగా, హుండీకి రూ.4.18 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News December 27, 2024

నిజమైన ‘భారతరత్న’ మన్మోహనుడే!

image

మాజీ ప్రధాని, భారత ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ క్రమంలో ఆయనకు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. నిజమైన భారత రత్నం ఇతడేనని, ఈయనకు భారత అత్యున్నత పురస్కారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు సార్లు ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారని గుర్తుచేస్తున్నారు. సింగ్‌కు 1987లోనే పద్మవిభూషణ్ వరించింది.

News December 27, 2024

ఆస్ట్రేలియా భారీ స్కోర్.. ఆలౌట్

image

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్సులో 474 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ 140, లబుషేన్ 72, ఖవాజా 57, కొన్ట్సస్ 60, కమిన్స్ 49 పరుగులతో రాణించారు. బుమ్రా4 , జడేజా 3, ఆకాశ్ దీప్ 2, సుందర్ ఒక వికెట్ తీశారు.