News May 23, 2024
టీడీపీతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోంది: అంబటి

AP: వైరల్ అవుతున్న మాచర్ల ఎమ్మెల్యే వీడియోను తాము రిలీజ్ చేయలేదని సీఈవో ముకేశ్ కుమార్ మీనా చెప్పడంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఎన్నికల కమిషన్ అలా ప్రకటించిందంటే పోలీసులు, అధికారులు టీడీపీతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోందని ఆయన ఆరోపించారు. పిన్నెల్లిపై ఫాల్స్ వీడియోను ట్విటర్‌లో రిలీజ్ చేసిన నారా లోకేశ్‌పై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని రాంబాబు డిమాండ్ చేశారు.
Similar News
News April 16, 2026
గుడిలో దర్శనం తర్వాత ఎందుకు కూర్చోవాలి?

ఆలయం ప్రశాంతతకు నిలయం. దైవ దర్శనంతో మనలోని కోపం, అహంకారం, స్వార్థం తాత్కాలికంగా దూరమవుతాయి. దర్శనం ముగిసిన వెంటనే జనబాహుళ్యంలోకి వెళ్తే మనసు మళ్లీ పాత ధోరణిలోకి వెళ్ళే అవకాశం ఉంది. అందుకే కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే, ఆ దేవాలయంలో జరిగే యజ్ఞ యాగాది క్రతువుల పుణ్య ఫలం వల్ల మనసులోని కల్మషం కరిగిపోతుంది. తద్వారా మనసు ప్రశాంతంగా మారి, కొంత సమయమైనా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన స్థితిని మనం పొందగలుగుతాము.
News April 16, 2026
మహిళలకు LSలో 272 సీట్లు: కేంద్ర మంత్రి

ఉమెన్ రిజర్వేషన్ల అమలు ద్వారా లోక్‌సభలో మహిళలకు 272 సీట్లు రిజర్వు అవుతాయని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రకటించారు. డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లులను ఆయన LSలో ప్రవేశపెట్టారు. ‘LS స్థానాలు 543 నుంచి గరిష్ఠంగా 850కి పెరుగుతాయి. ఇందులో రాష్ట్రాల నుంచి 815, UTల నుంచి 35 ఉంటాయి. రాష్ట్రాల్లో 50% చొప్పున సీట్లు పెరుగుతాయి. స్త్రీలకు 272 దక్కుతాయి. ఇవి 33%కి సమానం’ అని తెలిపారు.
News April 16, 2026
‘కంకణం కట్టుకోవడం’ వెనుక ఎంతో అర్థం

ఒక పనిని కచ్చితంగా, దృఢ సంకల్పంతో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని చెప్పే సందర్భంలో ‘కంకణం కట్టుకోవడం’ అనే జాతీయాన్ని వాడతాం. పెళ్లిళ్లు, శుభకార్యాలు, యజ్ఞాలు, వ్రతాలకు ముందు మణికట్టుకు కంకణ ధారణ చేస్తారు. ఇది మూడు/ఐదు పోగులతో ఉంటుంది. దీన్ని మామిడాకు/తమలపాకు/పసుపుకొమ్ముతో అలంకరిస్తారు. ఇలా చేస్తే ఆ కార్యం విజయవంతంగా పూర్తయ్యేందుకు సర్వేశ్వరుడు రక్షణగా ఉంటారని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>


