News May 23, 2024
IIT విద్యార్థులకూ దక్కని ప్లేస్‌మెంట్

భారత్‌లో ఉద్యోగ నియామక సంక్షోభం కొనసాగుతోంది. 2024లో 23 IIT క్యాంపస్‌లలోని 38% మందికి ప్లేస్‌మెంట్ లభించలేదని RTI ద్వారా వెల్లడైంది. ఉద్యోగాలకోసం 21,500 మంది నమోదు చేసుకుంటే.. 13,410 మందికే ఉద్యోగాలొచ్చాయి. ఇంకా 8090 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో చదువుకున్నప్పటికీ చాలా మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
Similar News
News April 18, 2026
అత్యాచారాలు చేసేవారిపై కాకుండా ప్రశ్నించే వారిపై కేసులా: YS జగన్

AP: ప్రశ్నించే గొంతుకలకు చంద్రబాబు ప్రభుత్వం సంకెళ్లు వేస్తోందని జగన్ విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్టుగా పని చేసిన పూడి శ్రీహరి చేసిన తప్పేంటని ప్రశ్నించారు. అక్రమ కేసు పెట్టడానికి, ఇంట్లో సోదాలు చేయడానికి అతనేమైనా ఉగ్రవాదా? అని మండిపడ్డారు. బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే చర్యలు తీసుకోని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు.
News April 18, 2026
భారత నౌకలపై IRGC కాల్పులు!

హార్ముజ్‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత నౌకలపై IRGC కాల్పులు జరిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అందులో ఒకటి 20 లక్షల బ్యారెళ్ల ఇరాక్ ఆయిల్‌తో వెళ్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ రెండు భారత షిప్పులు హార్ముజ్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని తెలిపింది. నౌకలతో పాటు అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది.
News April 18, 2026
GOOD NEWS: ఇంటర్ సెకండియర్‌కూ ఇంప్రూవ్‌మెంట్

AP: ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు బోర్డ్ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచి ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం ఇంప్రూవ్‌మెంట్ రాసుకోవచ్చని ప్రకటించింది. ఏ సబ్జెక్టులో మార్కులు తగ్గితే ఆ సబ్జెక్ట్ రాయొచ్చని, ప్రతి పేపర్‌లో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటామంది. దీనివల్ల మంచి కాలేజీల్లో సీటు రాకపోవడం, ఒత్తిడికి లోనవడం లాంటివి తగ్గే అవకాశం ఉందని బోర్డు తెలిపింది.


