News May 23, 2024

పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు ద్వారా విద్యార్థి దశ నుంచి ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తున్న రీతిలో ప్రకృతి వ్యవసాయం పట్ల విద్యార్థి దశ నుంచి అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News October 1, 2024

ఉమ్మడి కృష్ణాలో నూతన మద్యం దుకాణాలకు గెజిట్ విడుదల

image

నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా ఉమ్మడి కృష్ణాలో నోటిఫై చేసిన మద్యం దుకాణాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు విడుదల చేశారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో గెజిట్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 113, కృష్ణాజిల్లాలో 123 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి ఈ నెల 9 వరకు దరఖాస్తులు స్వీకరించి 11న టెండర్లు ఖరారు చేస్తారు.

News October 1, 2024

పింఛన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి, కలెక్టర్, ఎస్పీ

image

మచిలీపట్నంలోని 28వ డివిజన్‌లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను మంగళవారం మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ DK బాలాజీ, ఎస్పీ ఆర్. గంగాధర్ పంపిణీ చేశారు. ఈ మేరకు డివిజన్‌లో ఉన్న పలువురు లబ్ధిదారుల వద్దకు వెళ్లిన మంత్రి, జిల్లా ఉన్నతాధికారులు వారి యోగక్షేమాలను కనుక్కున్నారు. అనంతరం వారికి అక్టోబర్ నెల పింఛన్‌ నగదును అందజేశారు.

News October 1, 2024

విజయవాడలో వైసీపీ నేత ఇంటికి వచ్చిన మాజీ కేంద్ర మంత్రి

image

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ కుమార్‌ని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భవానీపురంలోని ఆకుల నివాసానికి వచ్చిన పల్లంరాజును ఆకుల సాదరంగా ఆహ్వనించారు. గతం నుంచి ఆకుల శ్రీనివాస్ కుమారుతో ఉన్న స్నేహ సంబంధాల నేపథ్యంలో పల్లంరాజు ఆయన నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు కలిసి గతంలో చేసిన పోరాటాలు, ఉద్యమాల గురించి గుర్తు చేసుకున్నారు.