News May 23, 2024

నేను విజయవాడ అమ్మాయినే: హీరోయిన్ లయ

image

తాను అమెరికా వెళ్లినా విజయవాడ అమ్మాయినేనని.. అందుకే అందరూ తనని తెలుగు అమ్మాయేనని పలకరించారని నటి లయ అన్నారు. 2007లో అమెరికా వెళ్లిన ఆమె..ప్రస్తుతం పిల్లలు పెద్దగవడంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ‘అలీతో సరదా’ ఇంటర్వ్యూలో చెప్పారు. కోనేరు హంపీ తండ్రి దగ్గర తాను చెస్ నేర్చుకున్నట్లు తెలిపారు. తన ఆర్థిక పరిస్థితి బాలేదని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు రాయడంపై చాలా బాధపడ్డట్లు ఆమె పేర్కొన్నారు.

Similar News

News April 16, 2026

కృష్ణా: ప్రారంభమైన జనగణన.. స్వీయ గణన చేసుకున్న కలెక్టర్

image

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2027 జనగణన కార్యక్రమం గురువారం కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. ఈ విడత ప్రజలే స్వీయ గణన చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో మచిలీపట్నంలో కలెక్టర్ డీకే బాలాజీ తన కుటుంబ వివరాలను జనగణన ఆన్ లైన్ పోర్టల్ https://se.space.gov.in ద్వారా నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ గణన చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

News April 16, 2026

కృష్ణాజిల్లాలోని ప్రభుత్వ కాలేజ్ లో ఇంటర్ ఫలితాలు ఇలా..?

image

* ఆకునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1st Year 50%, 2nd Year 56%
* అవనిగడ్డ కళాశాలలో 1st Year 57%, 2nd Year 67%
* బంటుమిల్లి కళాశాలలో 1st Year 63%, 2nd Year 74%
* మచిలీపట్నం లేడియాంప్తిల్ లో 1st Year 82%, 2nd Year 94%
* మొవ్వ కళాశాలలో 1st Year 76%, 2nd Year 89%
* పామర్రు కళాశాలలో 1st Year 66%, 2nd Year 92%
* పెడన కళాశాలలో 1st Year 49%, 2nd Year 67%
* రుద్రపాక కళాశాలలో 1st Year 38%, 2nd Year 48%

News April 16, 2026

భర్త మరణం తట్టుకోలేక.. భార్య కన్నుమూత

image

కృష్ణాజిల్లా గూడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కప్పలదొడ్డికి చెందిన తిరుమలశెట్టి వీర రాఘవరావు (66) అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య పద్మావతి (61) కొద్దిసేపటికే స్పృహ కోల్పోయారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె కూడా ప్రాణాలు విడిచారు. గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.