News May 23, 2024

ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన షారుఖ్

image

వడదెబ్బతో ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ డిశ్చార్జి అయ్యారు. ఆయన ముంబై వెళ్లనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లు షారుఖ్ మేనేజర్ పూజా వెల్లడించారు. వడదెబ్బతో అస్వస్థతకు గురైన షారుఖ్ నిన్న అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

Similar News

News August 31, 2025

కాళేశ్వరం నివేదికపై కాసేపట్లో చర్చ.. ఉత్కంఠ

image

TG: ఈ మధ్యాహ్నం కేరళకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చను ప్రారంభించనున్నారు. అర్ధరాత్రి వరకు సభ జరిగే అవకాశం ఉంది. నివేదికలోని ప్రధాన అంశాలతో మంత్రి ఇప్పటికే నోట్ రెడీ చేసుకున్నారు. ఆ రిపోర్టుపై ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

News August 31, 2025

పదేళ్లలో 1 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ: CM

image

KC వేణుగోపాల్ ప్రారంభించిన MP మెరిట్ అవార్డులకు దేశంలో ఎంతో ప్రత్యేకత ఉందని CM రేవంత్ పేర్కొన్నారు. కేరళలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘కేరళలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శం. TGలో విద్యాభివృద్ధిపై దృష్టి సారించాం. వచ్చే పదేళ్లలో తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం’ అని తెలిపారు.

News August 31, 2025

బదోనీ ‘డబుల్’ బాదుడు.. సెమీస్‌కు నార్త్ జోన్

image

దులీప్ ట్రోఫీలో భాగంగా క్వార్టర్ ఫైనల్-1లో నార్త్ జోన్ ప్లేయర్ ఆయుష్ బదోనీ(204*) డబుల్ సెంచరీతో రెచ్చిపోయారు. ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో 223 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్సర్లతో ద్విశతకం బాదారు. ఫస్ట్ ఇన్నింగ్సులోనూ బదోనీ 63 పరుగులు సాధించారు. యశ్ ధుల్, అంకిత్ కుమార్ కూడా శతకాలు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో నార్త్ జోన్ నేరుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.