News May 23, 2024
REWIND: ఎచ్చెర్లలో అత్యధికం, ఆముదాలవలసలో అత్యల్పం

2019 ఎన్నికలలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఎచ్చెర్లలో “NOTA”కు అత్యధిక ఓట్లు పడగా, ఆముదాలవలసలో అత్యల్ప ఓట్లు పడ్డాయి. ఈ మేరకు ఎచ్చెర్ల స్థానంలో “NOTA”ను 4,628 మంది ఎంచుకోగా, ఆముదాలవలస స్థానంలో 2,656 మంది “NOTA”కు ఓటేశారు. ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో “NOTA” ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుందో జూన్ 4న తెలియనుంది.
Similar News
News November 8, 2025
కనుమరుగైన బాలి యాత్ర..పున:ప్రారంభం వెనక కథ ఇదే

శ్రీముఖలింగంలో రేపు జరిగే బాలియాత్రకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 5 వేల ఏళ్ల క్రితం వదిలేసిన యాత్రను ఇటీవల ప్రారంభించారు. మహానది-గోదావరి వరకు గల కళింగాంధ్రాను ఖౌరవేలుడు పరిపాలించాడు. ఆయన కాలంలో శ్రీముఖలింగం ఆలయ సమీపాన వంశధార నది నుంచి వర్తకులు పంటలతో ఇండోనేషియాలో బాలికి వెళ్లేవారు. వారు క్షేమంగా రావాలని కార్తీక మాసంలో అరటి తెప్పల దీపాన్ని కుటుంబీకులు నదిలో విడిచిపెట్టడమే యాత్ర వృత్తాంతం.
News November 8, 2025
నరసన్నపేట: పంచలోహ విగ్రహాల అప్పగింత

నరసన్నపేటలోని సిద్ధాశ్రమంలో ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ నిందితుడి వద్ద సమాచారం రాబట్టి, విగ్రహాలను సిద్ధాశ్రమ నిర్వాహకులకు శుక్రవారం రాత్రి అందజేశారు.
News November 8, 2025
SKLM: ‘క్యాన్సర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి’

క్యాన్సర్ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని DMHO డాక్టర్ అనిత అన్నారు. శ్రీకాకుళం డీ ఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం వద్ద అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా వ్యాధి నివారణ కోసం శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రపంచంలో మొదటి స్థానంలో జబ్బు గుండె వ్యాధి ఉండగా, రెండవ స్థానంలో క్యాన్సర్ వ్యాధి ఉందని ఆమె పేర్కొన్నారు.18 ఏళ్లు నిండిన వ్యక్తులకు ఇంటి వద్దకు వచ్చి పరీక్షలు చేస్తారన్నారు.


