News May 23, 2024
రాజకీయ నాయకులు సహకరించాలి: కలెక్టర్
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ప్రతినిధులు సహకరించాలన్నారు. గురువారం సాయంత్రం నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
Similar News
News November 17, 2024
వెంకటగిరిలో చికెన్ ధర రూ.210
ఆదివారం మాంసం విక్రయాలకు ఉన్న డిమాండ్ చెప్పనవసరం లేదు. సామాన్యులు ఆదివారం రోజైనా మాంసం తినాలని కోరుకుంటారు. పెరిగిన ధరలతో ప్రజలు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రస్తుతం వెంకటగిరిలో చికెన్ కిలో రూ.210గా ఉంది. నాటు కోడి ధరలు కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కిలో రూ.600పైగా ఉన్నట్లు సమాచారం. ఇక పొట్టేలు మాంసం ధర రూ.700, మేకపోతు మాంసం ధర కిలో రూ.800 వరకు ఉంది. మీ ఊరిలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 17, 2024
నెల్లూరు: ఉరి వేసుకున్న యువకుడు
నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నఘటన శనివారం వెంకటాచలం మండలంలో వెలుగుచూసింది. జాకీర్ హుస్సేన్‌నగర్‌కు చెందిన గండికోట సురేంద్రబాబు(36) పాలిచెర్లపాడు వద్ద అడవిలో ఉరి వేసుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పోస్ట్ మార్టం కోసం బాడీని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబీకులకు సమాచారం అందించారు.
News November 16, 2024
నెల్లూరు: కాలువలో పడి ఇద్దరు చిన్నారులు మృతి
చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలోని అల్లిపురం గిరిజన కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సొన కాలువలో పడి అల్లిపురం గిరిజన కాలనీకి చెందిన నాగేంద్రమ్మ(11), చింతాలయ్య(11) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.