News May 23, 2024
ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలు పూర్తి

హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన సొంత పట్టణం మషాద్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆయనను చివరి చూపులు చూసేందుకు నగరానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. 63 ఏళ్ల రైసీ నాలుగు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భారత ప్రభుత్వం తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఇరాన్ వెళ్లి రైసీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
Similar News
News September 17, 2025
ఓంకారం ఓ ఆరోగ్య సంజీవని

ఓంకారం కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు. ఇది ఓ సంపూర్ణ ఆరోగ్య సంజీవని. నాభి నుంచి పలికే ఈ లయబద్ధమైన శబ్దం శరీరంలోని ప్రతి అణువునూ ఉత్తేజపరుస్తుంది. దీని పఠనం రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలను తొలగించి, అపారమైన ప్రశాంతతను అందిస్తుంది. ఓంకారం మనసు, శరీరం, ఆత్మల ఏకీకరణకు ఓ శక్తిమంతమైన సాధనం.
News September 17, 2025
కుమార స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఒకరేనా?

సుబ్రహ్మణ్య స్వామి, కుమార స్వామి వేర్వేరు కాదు. ఆయన శివ పార్వతుల కుమారుడు. గణపతి, అయ్యప్పలకి సోదరుడు. శివుడి కుమారుడు కాబట్టి కుమారస్వామి అనే పేరొచ్చింది. ఆయణ్నే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, మురుగన్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఆయనను దేవతల సైన్యాధిపతిగా, జ్ఞానానికి, యుద్ధానికి దేవుడిగా పూజిస్తారు. ఆరు ముఖాలు, పన్నెండు చేతులతో దర్శనమిచ్చే ఆయన ఆధ్యాత్మిక శక్తికి, పవిత్రతకు ప్రతీక.
News September 17, 2025
‘అయ్యప్ప’ అంటే అర్థం ఇదే!

అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడు. అయ్య అంటే విష్ణువును సూచించే అయ్యన్ అని, అప్ప అంటే శివుడిని సూచించే అప్పన్ అని అర్థం వస్తుంది. ఈ రెండు పదాల కలయికతోనే ఆయనకు అయ్యప్ప అనే పేరు వచ్చింది. ఆయనను ధర్మశాస్తా, మణికంఠుడు అని కూడా పిలుస్తారు. మహిషాసురిడి సోదరి అయిన మహిషిని సంహరించి అయ్యప్ప ధర్మాన్ని నిలబెడతాడు. శబరిమల క్షేత్రంలో కొలువై ఉంటాడు. భక్తులు ఇక్కడికి దీక్షతో వెళ్లి ఆయన ఆశీస్సులు పొందుతారు.