News May 23, 2024
నాకు, నా కుటుంబానికి భద్రత పెంచండి: పులివర్తి నాని

టీడీపీ నేత పులివర్తి నానిపై ఈ నెల 14న జరిగిన దాడి కేసులో ఆయన్ను పోలీసులు తాజాగా విచారించారు. భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘు, భానుకుమార్ తనపై హత్యాయత్నం చేశారని నాని వారికి తెలిపారు. ‘అసలు నిందితుల్ని పోలీసులు వదిలేశారు. 70మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. నాకు, నా కుటుంబానికి భద్రతను మరింత పెంచాలి. రీపోలింగ్ అవసరం లేదు. కౌంటింగ్ సరిగ్గా జరిగేలా అధికారులు చూడాలి’ అని కోరారు.
Similar News
News January 14, 2026
ఫేక్ రిఫండ్లతో ₹5 కోట్లు కొల్లగొట్టాడు

e-కామర్స్ ప్లాట్‌ఫాంల రిటర్న్ సిస్టమ్ లూప్‌హోల్స్‌ను ఆసరా చేసుకొని ఓ యువకుడు రిఫండ్ కింద ఏకంగా ₹5Cr కొల్లగొట్టాడు. చైనాలో లూ అనే వ్యక్తి కాస్మొటిక్ షాపింగ్ ప్లాట్‌ఫాంలో 11900 ఫేక్ రిఫండ్ రిక్వెస్టులు పెట్టాడు. తనకు వచ్చిన వస్తువుల్ని తిరిగి సెకండ్స్ కింద మార్కెట్లో అమ్మేవాడు. 2024లో రిఫండ్‌లపై అనుమానంతో ఓ కంపెనీ ఫిర్యాదు చేయగా స్కామ్ బయటపడింది. చివరకు కోర్టు అతనికి 6ఏళ్ల జైలుశిక్ష విధించింది.
News January 14, 2026
వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నం.1

విరాట్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానం దక్కించుకున్నారు. ఇటీవల భీకర ఫామ్‌లో ఉన్న అతడు ICC తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ను వెనక్కి నెట్టి నాలుగేళ్ల తర్వాత ఫస్ట్ ప్లేస్‌కి చేరారు. రోహిత్ శర్మ మూడో ర్యాంకుకు పడిపోయారు. గిల్-5, శ్రేయస్-10 స్థానంలో ఉన్నారు. ఇక ఓవరాల్‌గా 28,068 రన్స్‌తో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా 34,357 పరుగులతో సచిన్ తొలి స్థానంలో ఉన్నారు.
News January 14, 2026
కొందరి పౌరసత్వ నిర్ధారణ కోసం ఎన్నికల ప్రక్రియను ఆపలేము: ECI

పౌరసత్వం తేలేవరకు ఓటు హక్కును తొలగించవచ్చా? అని ECని SC ప్రశ్నించింది. SIR వ్యాజ్యంపై CJI సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి విచారించారు. ‘పౌరసత్వంపై కేంద్రానికి నివేదించి EC నిర్ణయం తీసుకుంటుంది. అయితే కేంద్రం తేల్చే వరకు వేచి ఉండకుండా EC నిర్ణయం తీసుకోవచ్చు. ఓటరు పేరు తొలగించొచ్చు. దానిపై సదరు వ్యక్తి అప్పీలు చేయొచ్చు’ అని EC న్యాయవాది ద్వివేది కోర్టుకు తెలిపారు. దీనికోసం ఎన్నిక ప్రక్రియ ఆపలేమన్నారు.


