News May 24, 2024

కృష్ణా: ఈ నెల 25తో ముగియనున్న గడువు

image

బీఈడీ కోర్సులో ప్రవేశాలకు రాయాల్సిన ఎడ్‌సెట్-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఆన్‌లైన్ దరఖాస్తులలో తప్పులు దొర్లి ఉంటే ఏపీ ఉన్నత విద్య మండలి సవరించుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులలో కరెక్షన్స్ ఉంటే ఈ నెల 25లోపు సరిదిద్దుకోవచ్చని సూచించింది. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్‌సైట్ చూడాలని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.

Similar News

News November 8, 2025

నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ‘మీ-కోసం’ హాల్లో సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీలను సూచించారు.

News November 7, 2025

ఓటర్ల అభ్యర్థనలను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో బుక్ ఏ-కాల్ విత్-బి.ఎల్‌ఓకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న 82 ఓటర్ల అభ్యర్థనలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ బాలాజీ ఎన్నికల అధికారులను శుక్రవారం ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాష్ట్ర వ్యాప్తంగా ‘బుక్ ఏ-కాల్ విత్-బీఎల్ఓ పేరిట ఓటర్ల సౌకర్యం కోసం ఈసీఐ వెబ్‌సైట్ ద్వారా నూతన విధానంలో ఒక వేదికను ఏర్పాటు చేశారన్నారు.

News November 7, 2025

త్వరలో గుడివాడకు వందే భారత్ రైలు

image

చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవను గుడివాడ, భీమవరం టౌన్ మీదుగా నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విస్తరణతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలకు ఇది ఎంతో ప్రయోజనకరం.