News May 24, 2024

జూన్ 6వ తేదీ వరకు బాణాసంచా విక్రయించరాదు: బాపట్ల ఎస్పీ

image

ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 6వ తేదీ వరకు బాణాసంచా విక్రయించరాదని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్ బంకులలో కేవలం వాహనాలలో మాత్రమే పెట్రోల్ పోయాలని, బాటిళ్లలో పోయవద్దని సూచించారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అల్లర్లకు దూరంగా ఉండాలని కోరారు. జిల్లాలో సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

Similar News

News January 10, 2026

తెనాలిలో అర్ధరాత్రి ఏసీ మెకానిక్ దారుణ హత్య

image

తెనాలి నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్(52) హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి తెనాలి టీచర్స్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని దుండగులు ఫయాజ్‌ను కొట్టి చంపి పడవేశారు. స్థానికులు గుర్తించి అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో కర్రలు, రాడ్లు ఉన్నట్లు గుర్తించారు. సీఐ సాంబశివరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.

News January 10, 2026

VJA: దుర్గమ్మ శ్రీచక్రార్చన పాలలో పురుగు.. వాస్తవమెంత?

image

దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం ఉదయం కలకలం రేగింది. ప్రతిరోజూ అమ్మవారికి నిర్వహించే శ్రీచక్రార్చన కోసం సిద్ధం చేసిన పాల ప్యాకెట్లలో ఒక దానిలో పురుగు కనిపించింది. అర్చకులు వెంటనే ఆ పాలను పక్కన పడేసి ఇతర పాలతో అర్చన పూర్తి చేశారు. కొన్నేళ్లుగా ప్యాకెట్ పాలు, విడిగా ఆవుపాలను సేకరిస్తున్నామని, ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు ఎదురుకాలేదని, ఈ విషయాన్ని కొందరు కావాలనే పెద్దది చేస్తున్నారని ఆలయ వర్గాలు తెలిపాయి.

News January 10, 2026

గుంటూరులో నేటి నుంచి UTF రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు

image

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నేటి నుంచి గుంటూరులో ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు గుంటూరు ఆంధ్రా క్రైస్తవ కళాశాల వేదికగా నిలవనుంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో పాటూ, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు ఇప్పటికే పూర్తి చేశారు.