News May 24, 2024
భ్రూణ హత్యలను నివారించండి: తిరుపతి కలెక్టర్

జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పటిష్ఠంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. సమాజంలో స్త్రీ, పురుషులు సమానమేనని, ఆడపిల్లల పట్ల వివక్షత ఉండకూడదని కలెక్టర్ తెలిపారు.
Similar News
News January 20, 2026
పలమనేరు: 23 ఏనుగులు మృతి!

కౌండిన్య అభయారణ్యంలో నిన్న మొదటి ఏనుగు విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా అటవీ పరిధిలో ఇప్పటివరకు 23 ఏనుగులు మృతి చెందాయి. గత పది ఏళ్లలో 15 ఏనుగులు కరెంట్ షాక్‌తోనే మృతి చెందాయి. ఏనుగులకు ప్రమాదాలు వాటిల్లకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
News January 20, 2026
చిత్తూరు: నత్త నడకన పన్ను వసూళ్లు

చిత్తూరు జిల్లాలోని మున్సిపాలిటీలలో పన్ను వసూలు నత్తనడకన కొనసాగుతోంది. ఇప్పటివరకు 50 శాతం కూడా పన్ను వసూలు కాలేదు. చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో రూ.32 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉండగా రూ.14 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. అలాగే పుంగనూరులో రూ.6 కోట్లకు రూ.3.52 కోట్లు, నగరిలో రూ.4.98 కోట్లకు రూ.2.17 కోట్లు మాత్రమే వసూలు అయినట్టు అధికారులు చెప్పారు.
News January 20, 2026
చిత్తూరు; స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం

చౌడేపల్లి (M) కాగతి ప్రాథమికోన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలకు ఉదయం ఆవరణంలోకి వచ్చి ముగ్గు వేసి, నిమ్మకాయలు కోసి, అక్షింతలు వేసి తాంత్రిక పూజలు చేసినట్లు సీసీ కెమెరాలులో నమోదయ్యాయి. ఈ ఘటన చూసిన ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


