News May 24, 2024
నేటి నుంచి టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

APలో టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. టెన్త్ పరీక్షలకు 1,61,877 మంది, <<13291696>>ఇంటర్<<>> రెండేళ్లకు కలిపి 4,67,938 మంది పరీక్షలు రాయనున్నారు. సప్లిమెంటరీ ఫీజు కట్టని టెన్త్ విద్యార్థులకూ పరీక్ష రాసే అవకాశం అధికారులు కల్పించారు. 1.61లక్షల మంది ఫెయిల్ కాగా ఫీజు 1.15 లక్షల మందే చెల్లించారు. పెండింగ్లో ఉన్న టెన్త్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు నెలాఖరులోపు విడుదల చేయనున్నారు.
Similar News
News July 5, 2025
ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన HYDలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
News July 5, 2025
ఎల్లుండి ఫలితాలు విడుదల

తెలంగాణ ఐసెట్ ఫలితాలు జులై 7న విడుదల కానున్నాయి. HYD ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం మ.3.30 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 8,9 తేదీల్లో రోజుకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. జూన్ 21న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీ విడుదల చేశారు. 71,757 మంది పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.
News July 5, 2025
ప్రజలకు మీరు చేసే సత్కారం ఇదేనా?: KTR

TG: సీఎం రేవంత్ రెడ్డి <<16942338>>వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘మీ PayCM అందరినీ బట్టలిప్పి కొడితే తప్ప ఇందిరా గాంధీ గొప్పతనం అర్థం కాదంటున్నాడు. ప్రజలకు మీరు చేసే సత్కారం ఇదేనా రాహుల్ గాంధీ? తెలంగాణను ఏఐసీసీకి ఏటీఏంగా మార్చినప్పటి నుంచి ఆయన ఏది పడితే అది మాట్లాడటాన్ని అనుమతిస్తున్న మీ విధానాన్ని జనం గమనిస్తూనే ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.