News May 24, 2024

విశాఖ: సైబర్ నేరగాళ్ల నుంచి 60 మందికి విముక్తి

image

కంబోడియా సైబర్ నేరగాళ్ల నుంచి ఎట్టకేలకు 60 మందికి విముక్తి లభించింది. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న విశాఖ వాసి ఒకరు ఇచ్చిన సమాచారంతో విశాఖ నగర కమిషనర్ స్పందించారు. విశాఖకు చెందిన 150 మంది, దేశవ్యాప్తంగా 5,000 మంది కంబోడియా మోసగాళ్ల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. విముక్తి లభించిన 60 మంది గురువారం భారత్‌కు బయలుదేరినట్లు విశాఖ పోలీసులకు సమాచారం అందింది. వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.

Similar News

News March 6, 2026

స్టడీ టూర్‌కు పట్టుబడుతున్న జీవీఎంసీ కార్పొరేటర్లు

image

విశాఖ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరోసారి స్టడీ టూర్ నిర్వహించాలని పట్టుబడుతున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కనీసం ఒక్కసారి అధ్యయన యాత్రకు అనుమతి ఇవ్వాలని మేయర్, కమిషనర్‌ను కోరుతున్నారు. ఐదేళ్ల కాలంలో నాలుగేళ్లపాటు మాత్రమే యాత్రలు జరిగాయని, ఒక సంవత్సరం మిగిలిపోయిందని వారు చెబుతున్నారు. ఈనెల 10 నుంచి 14 వరకు టూర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

News March 6, 2026

విశాఖ: 5 నిమిషాల ఆలస్యంతో అవకాశం కోల్పోయారు

image

రైల్వే టెక్నీషియన్ గ్రేడ్-3 పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో సుమారు పది మంది అభ్యర్థులు అవకాశం కోల్పోయారు. పెందుర్తి చినముషిడివాడ డిజిటల్ అయాన్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం మొదటి షిఫ్ట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 నుంచి 8:30 వరకు రిపోర్టింగ్ సమయం కాగా, అభ్యర్థులు 8:35 గంటలకు రావడంతో వారిని అనుమతించలేదు. ఈ పరీక్షకి ఒడిశా నుంచి వచ్చామని, అవకాశం కోల్పోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

News March 6, 2026

విశాఖ మురికివాడలకు మహార్దశ

image

విశాఖలోని మురికివాడల అభివృద్ధికి చర్యలు మొదలయ్యాయి. జీవీఎంసీ పరిధిలో గుర్తించిన 66 మురికివాడల్లో వెలంపేట, ఇందిరానగర్ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. ముంబయి తరహాలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి అందించనున్నారు. పీపీపీ విధానంలో అమలు చేయనున్న ఈ ప్రణాళికలో వెలంపేటలో 177 కుటుంబాల కోసం రూ.23.17 కోట్లు, ఇందిరానగర్‌లో 110 కుటుంబాల కోసం రూ.16.18 కోట్లు ఖర్చు చేయనున్నారు.