News May 24, 2024
KMM: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వాహణకు అధికారులు జిల్లాలో 42కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 14,984 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా, ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 10,352మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 4,632 ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఉదయం 9నుంచి మధ్యహ్నం 12గంటల వరకు సెకండ్ ఇయర్ మధ్యహ్నం 2:30 నుంచి 5:30వరకు నిర్వహిస్తారు. జూన్1న పరీక్షలు ముగియనున్నాయి.
Similar News
News July 5, 2025
సాగర్ నుంచి పాలేరుకు నీటి విడుదల

పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వ తగ్గినందున తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రాజెక్టు ఏఈ కృష్ణయ్య ఎడమ కాల్వ ద్వారా పాలేరుకు నీటిని విడుదల చేశారు. రోజుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.
News July 5, 2025
అత్యధికంగా ఖమ్మం రూరల్.. అత్యల్పంగా మధిర

ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గతేడాది కంటే పెరిగింది. గతేడాది 66,288 మంది ఉండగా, ఈ ఏడాది 68,175కు చేరింది. 1,887 మంది విద్యార్థులు పెరిగారు. అత్యధికంగా KMM (R) 359 మంది, అతి తక్కువగా మధిరలో ఆరుగురు పెరిగారు. కూసుమంచి 318, KMM (U)18, SPL 167, పెనుబల్లి 121, సింగరేణి 158, బోనకల్ 104, కల్లూరు 105, ఎర్రుపాలెం 91, ఏన్కూరు 75, ముదిగొండ 63, తల్లాడ 15, కామేపల్లిలో 11 మంది పెరిగారు.
News July 5, 2025
ఖమ్మం జిల్లాలో ముగిసిన కళాశాలల బంద్

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాలో ఈనెల 3, 4న PDSU తలపెట్టిన 48 గంటల కళాశాలల బంద్ శుక్రవారం నాటికి ముగిసింది. బంద్ సందర్భంగా ఖమ్మం కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాల ముందు PDSU నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల సమస్యలు మాత్రం తీరడం లేదని దుయ్యబట్టారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.