News May 24, 2024
నిర్మల్: నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు ఉంటాయి. ఇంటర్ మొదటి సంవత్సరంలో 3,416 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 2,001 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అధికారులు పేర్కొన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుంది.
Similar News
News March 13, 2025
అంతర్జాతీయ కళాపోటీల్లో ADB వాసికి అవార్డ్

దేశంలోని కళాకారులు, 5 దేశాలకు పైగా NRIల మధ్య నిర్వహించిన సెషన్ 16వ అంతర్జాతీయ కళాపోటీల్లో ADB టీచర్స్ కాలనీకి చెందిన గాధరి చంద్రశేఖర్ ప్రతిభ కనబర్చాడు. ఇన్నోవిజే గ్లోబల్ టాలెంట్ సెర్చ్ ర్యాంక్ స్లాట్ ప్రకారం ఐఏసీ నుంచి డ్రాయింగ్, పెయింటింగ్ విభాగంలో ది మెడల్ ఆఫ్ అప్రిషియేషన్‌తో పాటు ది లెటర్ ఆఫ్ రికగ్నిషన్ లెవల్-2లో అవార్డు అందుకున్నాడు. అర్హులైన కళాకారుల్లో ఒకరిగా పేరు సాధించుకున్నారు.
News March 13, 2025
ADB: సెకండియర్ పరీక్షకు 386 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ మ్యాథమెటిక్స్, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షకు మొత్తం 9,088కి 8,702 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఐఈఓ గణేశ్ జాదవ్ తెలిపారు. 386 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
News March 12, 2025
‘ప్రశక్తి’ అవార్డుకు నార్నూర్ ఎంపిక

దేశ రాజధాని ఢిల్లీ నుంచి DAPRG అదనపు కార్యదర్శులు కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ బ్లాక్‌లలో అమలు చేసిన చర్యలు, ముఖ్య విజయాలను స్క్రీనింగ్ కమిటీకి కలెక్టర్ సమర్పించారు. దీంతో నార్నూర్ బ్లాక్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కేటగిరిలో ప్రధానమంత్రి ‘ప్రశక్తి’ అవార్డు-2024 రెండో రౌండుకు ఎంపికైందన్నారు.