News May 24, 2024
అన్నతో తేల్చుకోవాలని షర్మిలకు చెప్పా: వీహెచ్

AP: తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిలకు ఏపీ వెళ్లి అన్నతో తేల్చుకోవాలని గతంలోనే చెప్పానని కాంగ్రెస్ సీనియర్ నేత VH హనుమంతరావు తెలిపారు. రాజమండ్రిలో మాట్లాడుతూ.. ఆమె మూడేళ్ల కిందటే ఏపీకి వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. వచ్చే ఐదేళ్లలో ఇక్కడ కూడా కాంగ్రెస్ బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నెలకొల్పే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రాజమండ్రిలో తయారు చేయిస్తున్నామన్నారు.
Similar News
News September 17, 2025
OG టికెట్ ధరలు భారీగా పెంపు

పవన్ కళ్యాణ్ ‘OG’ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకు అనుమతిస్తూ టికెట్ ధరను రూ.1000గా పేర్కొంది. అంతేకాకుండా అక్టోబర్ నాలుగు వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో గరిష్ఠంగా రూ.125, మల్టీప్లెక్స్‌లలో రూ.150 వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని తెలిపింది. మరోవైపు తెలంగాణలో టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
News September 17, 2025
నా రాజీనామాను ఇంకా ఆమోదించలేదు: కవిత

TG: MLC పదవికి తన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేరని చెప్పారు. ‘రాజీనామాను ఆమోదించిన 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. నేను ఎన్నికైనప్పుడు ఆ సీటు 6 నెలలకు పైగా ఖాళీగానే ఉంది. అవసరమైతే ఛైర్మన్‌ను మళ్లీ కలుస్తా’ అని మీడియా చిట్ చాట్‌లో వ్యాఖ్యానించారు.
News September 17, 2025
టీనేజర్ల కోసం ChatGPTలో సెక్యూరిటీ ఫీచర్లు!

టీనేజర్ల భద్రత, ప్రైవసీ కోసం ChatGPTలో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లను తీసుకొస్తున్నట్లు OpenAI ప్రకటించింది. యూజర్లను వయసు ఆధారంగా 2 కేటగిరీలుగా (13-17, 18+) గుర్తించేందుకు age ప్రిడిక్షన్ సిస్టమ్‌ను తీసుకురానుంది. యూజర్ ఇంటరాక్షన్‌ను బట్టి వయసును అంచనా వేయనుంది. కొన్నిసార్లు ఏజ్ వెరిఫై కోసం ID కూడా అడుగుతుందని సంస్థ తెలిపింది. సూసైడ్ వంటి సెన్సిటివ్ అంశాలపై AI స్పందించదని వివరించింది.