News May 24, 2024
మా ప్రదర్శన పట్ల గర్వంగా ఉంది: కోహ్లీ
ఈ IPLలో తమ జట్టు ఆటతీరుపై గర్వంగా ఉందని RCB స్టార్ ప్లేయర్ కోహ్లీ అన్నారు. ‘వరుస ఓటములతో ఓ దశలో మా టీమ్ కుంగిపోయింది. అప్పుడు ఆత్మగౌరవం కోసం ఆడాలని నిర్ణయించుకున్నాక.. వరుసగా 6 మ్యాచ్‌లలో గెలవడం చాలా గొప్ప అనుభూతి ఇచ్చింది. మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. మొత్తం మారి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడం ఎంతో ప్రత్యేకం. దీన్ని మర్చిపోను. టోర్నీ నుంచి నిష్క్రమించడం నిరాశ కలిగించింది’ అని కోహ్లీ చెప్పారు.
Similar News
News January 16, 2025
యాక్సిడెంట్‌కు గురైన వ్యక్తి బైక్‌తో పరార్.. చివరికి ఏమైందంటే?
మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని చెప్పే కర్మ సిద్ధాంతానికి ఈ ఘటన నిదర్శనం. ఢిల్లీలో ప్రమాదానికి గురైన ఓ వ్యక్తికి సాయం చేయకుండా, అతని బైక్‌ను ఎత్తుకెళ్లిన ముగ్గురికి యాక్సిడెంట్ అయింది. వికాస్ అనే వ్యక్తి బైక్ నుంచి పడిపోగా ఇది చూసిన ఉదయ్, టింకు, పరంబీర్‌లు అతడి బైక్‌తో పరారయ్యారు. కొద్దిసేపటికే వీరికి యాక్సిడెంట్ కాగా తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరారు. కాగా, వికాస్ చనిపోయాడు.
News January 16, 2025
టీమ్ఇండియాకు బ్యాటింగ్ కోచ్‌గా ఉంటా: కెవిన్
టీమ్ఇండియాకు బ్యాటింగ్ కోచ్‌గా ఉండేందుకు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఇంట్రెస్ట్ చూపారు. పురుషుల జట్టు కోసం బ్యాటింగ్ కోచ్ అన్వేషణలో బీసీసీఐ ఉందని ఓ జర్నలిస్టు చేసిన ట్వీట్‌కు కెవిన్ రిప్లై ఇచ్చారు. నేను అందుబాటులో ఉన్నా అంటూ ఆయన సమాధానమిచ్చారు. కెవిన్ తన కెరీర్‌లో 104 టెస్టుల్లో 8181 రన్స్, 136 వన్డేల్లో 4440, 37 టీ20ల్లో 1176 రన్స్ చేశారు.
News January 16, 2025
ఎల్లుండి ఏపీ పర్యటనకు అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 18న ఏపీకి రానున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకొని అదే రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం నివాసంలో విందుకు హాజరవుతారు. అనంతరం విజయవాడ హోటల్‌లో బస చేస్తారు. 19న ఉదయం కొండపావులూరులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెంటర్‌తో పాటు NDRF పదో బెటాలియన్ ప్రాంగణాలను ప్రారంభిస్తారు. బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్తారు.