News May 24, 2024

శ్రీకాకుళం: పోలింగ్ రోజు కొట్లాట.. 28మంది అరెస్ట్

image

పొందూరు మండలం గోకర్ణపల్లిలో ఈనెల 13న ఎన్నికల సమయంలో జరిగిన కొట్లాటకు సంబంధించి 28 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు స్థానిక ఎస్సై వై.రవికుమార్ తెలిపారు. గోకర్ణపల్లిలో జరిగిన కొట్లాటలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని రిమ్స్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బుధ, గురువారాల్లో 28 మందిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం కోర్టు రిమాండ్ విధించగా, అంపోలు జైలుకు తరలించారు.

Similar News

News July 7, 2025

నందిగాం: పురుగు మందు తాగి మహిళ ఆత్మహత్య

image

నందిగాం మండలం జయపురం గ్రామానికి చెందిన ఆర్.రత్నాలు(54) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గత కొద్ది రోజులుగా మహిళ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి ఇంటిలో పురుగు మందు తాగింది. అపస్మారక స్థితిలో చేరుకున్న ఆమెను కుటుంబీకులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. నందిగాం పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 7, 2025

శ్రీకాకుళం IIITలో 149 సీట్లు ఖాళీ

image

శ్రీకాకుళం IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ ఇటీవల పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 867 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 149 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.

News July 7, 2025

శ్రీకాకుళంలో నేడు పీజీఆర్‌ఎస్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.