News May 24, 2024

రాహుల్‌ను చిక్కుల్లోకి నెట్టిన లాంగర్

image

భారత హెడ్‌కోచ్ పదవిపై జస్టిన్ లాంగర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘భారత కోచ్ బాధ్యతలు ఎలా ఉంటాయన్న విషయంపై KL రాహుల్‌తో చర్చించా. IPL కంటే వేల రెట్లు ఒత్తిడి, రాజకీయాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. అందుకే హెడ్ కోచ్ పదవికి పోటీ నుంచి తప్పుకున్నా’ అంటూ లాంగర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. రాహుల్‌కు అలా ఎందుకు అనిపించింది? నిజంగా లాంగర్‌కు చెప్పారా? అన్నది క్రీడా వర్గాల్లో సంచలనంగా మారింది.

Similar News

News April 18, 2026

పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.

News April 18, 2026

IPLలో అన్‌సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఇతడే..

image

IPL చరిత్రలో 25+ మ్యాచులకు నాయకత్వం వహించి అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్(31.8%) కలిగిన కెప్టెన్‌గా అజింక్య రహానే నిలిచారు. ఆయన 44 మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 14సార్లు మాత్రమే గెలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(33.3%), సంగక్కర (36.2%), ధవన్ (37%), గంగూలీ(40.5%) ఉన్నారు. కాగా ప్రస్తుత సీజన్‌లో రహానే కెప్టెన్సీలో KKR ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడగా ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది.

News April 18, 2026

SRHలోకి సౌతాఫ్రికా పేసర్

image

IPL: గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో SRH మరో పేసర్‌ను తీసుకుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీని రూ.2కోట్లకు జాయిన్ చేసుకుంది. ఈ విషయాన్ని IPL, ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించాయి. కోయెట్జీ గతంలో ముంబై, గుజరాత్ జట్ల తరఫున 14 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటివరకు 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20ల్లో 67 వికెట్లు తీశారు.