News May 24, 2024
తెలంగాణలో నకిలీ మందుల కలకలం
TG: ప్రముఖ కంపెనీల లేబుళ్లతో మెడికల్ షాపుల్లో నకిలీ మందులు అమ్ముతున్నట్లు రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీల్లో తేలింది. కాలం చెల్లిన మందులు, లైసెన్స్ల్లేని షాపులతో పాటు కొన్ని మెడిసిన్లు అధిక ధరకు అమ్ముతున్నట్లు నిర్ధారించింది. ఇవి హిమాచల్, ఉత్తరాఖండ్ నుంచి వస్తున్నట్లు గుర్తించింది. అసలైనవేవో, కల్తీవేవో తెలియని దుస్థితి తెచ్చి.. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతూ షాపులు నడుపుతున్నారంది.
Similar News
News January 16, 2025
2 నెలల్లో ఉచిత బస్సు పథకం: మంత్రి మండిపల్లి
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధిలో AP దూసుకెళ్తోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. మహిళలకు 3 సిలిండర్లు, 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. మరో 2 నెలల్లో ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలవుతుందని తెలిపారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు క్యూ కడుతున్నాయని వెల్లడించారు. తిరుపతి(D)లోని శ్రీసిటీని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
News January 16, 2025
KTR.. ‘గ్రీన్ కో’ను ఎందుకు కాపాడుతున్నావ్: సామ
ఫార్ములా కేసులో KTR అవినీతి స్పష్టంగా కన్పిస్తోందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదేశాలతోనే ఫార్ములా-e వారికి HMDA (గ్రీన్ కో తరపున) డబ్బులు చెల్లించినట్టు ఆధారాలు ఉన్నాయన్నారు. నష్టాల వల్లే గ్రీన్ కో తప్పుకుందన్న KTR.. ఫార్ములా-eకి మొదటి సీజన్ డబ్బు కట్టలేదనే విషయం మాత్రం ఎందుకు దాచారని ప్రశ్నించారు. గ్రీన్ కో’ను ఎందుకు కాపాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
News January 16, 2025
ఎల్లుండి 2 జిల్లాల్లో సీఎం పర్యటన
AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం గుంటూరులో <<15157199>>వాట్సాప్ గవర్నెన్స్ సేవలను<<>>, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లాలో నిర్వహించే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని ఉండవల్లికి తిరిగెళ్తారు. సాయంత్రం తన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్షాకు డిన్నర్ ఇవ్వనున్నారు. సీఎం 19న దావోస్ పర్యటనకు బయలుదేరుతారు.