News May 24, 2024
గ్రూప్-2, 3 పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలి: నిరుద్యోగులు

TG: గ్రూప్-2, 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దం తర్వాత ఈ నోటిఫికేషన్లు వచ్చాయని.. గత ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలకే పరీక్షలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. TGPSCని ప్రక్షాళన చేసిన సమావేశంలో సీఎం రేవంత్ కూడా పోస్టుల సంఖ్యను పెంచుతామని చెప్పారని గుర్తుచేస్తున్నారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News September 17, 2025
‘నా మిత్రుడు ట్రంప్’కు ధన్యవాదాలు: PM మోదీ

ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం అమెరికా చేసే చొరవలకు మద్దతు ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘నా 75వ పుట్టినరోజు సందర్భంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ధన్యవాదాలు. మీలాగే, నేను కూడా భారతదేశం-అమెరికా సమగ్ర, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
News September 17, 2025
త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం: మంత్రులు

TG: త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తామని మంత్రులు సురేఖ, సీతక్క వెల్లడించారు. ‘కుటుంబ బాధ్యతలు, వృత్తి బాధ్యతల్లో మహిళలు నిత్యం ఒత్తిడులకు గురవుతున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కూడా చూసుకోవాలి. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈనెల 22న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తాం. మహిళల సూచనలతో కొత్త మహిళా పాలసీని తీసుకొస్తాం’ అని సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.
News September 17, 2025
ఇకపై లక్కీ డిప్‌లో అంగప్రదక్షిణ టోకెన్లు

శ్రీవారి అంగప్రదక్షిణ టోకెన్లకు FIFO (First In First Out) స్థానంలో లక్కీ డిప్ విధానాన్ని TTD ప్రవేశపెట్టింది. టోకెన్లు 3 నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ సిస్టమ్ ద్వారా విడుదల అవుతాయి. DEC టోకెన్ల కోసం SEP 18-20 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రోజూ (శుక్రవారం) 750 టోకెన్లు, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేస్తారు. భక్తులు తిరిగి ఈ సేవ పొందేందుకు గడువు 180 రోజులుగా నిర్ణయించింది.