News May 24, 2024

Record: 66 ఏళ్ల వృద్ధురాలి క్రికెట్ అరంగేట్రం

image

వృద్ధురాలు సాలీ బార్టన్ క్రికెట్‌లో వరల్డ్ రికార్డ్ సాధించారు. 66 ఏళ్ల 334 రోజుల వయసున్న ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. WK అయిన బార్టన్ ఎస్టోనియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో జిబ్రాల్టర్ తరఫున బరిలోకి దిగారు. వికెట్ల వెనుకాల చురుగ్గా ఉంటూ మనమరాళ్ల వయసున్న ప్లేయర్లకు ఆదర్శంగా నిలిచారు. ఈ అరంగేట్రంతో ఆమె పోర్చుగల్ క్రికెటర్ అక్బర్ (66 ఏళ్ల 12 రోజులు) రికార్డును బద్దలు కొట్టారు.

Similar News

News January 28, 2026

ఫ్లైట్లు/హెలికాప్టర్లు కూలగానే ఎందుకు కాలిపోతాయి?

image

ఫ్లైట్లు/హెలికాప్టర్లు కూలగానే క్షణాల్లో మంటలు చెలరేగడం, అందులో ప్రయాణికులు చిక్కుకొని ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం వాటిల్లో అధిక మోతాదులో ఉండే ఇంధనం. ఫ్లైట్లు/హెలికాప్టర్లు తీవ్రమైన వేగం/ఘర్షణతో కదులుతుంటాయి. ఆ సమయంలో ప్రమాదం జరిగితే రెక్కలు లేదా ట్యాంకులు పగిలి ఇంధనం బయటకు వస్తుంది. ఇంజిన్ వేడికి లేదా రాపిడి వల్ల వచ్చే నిప్పురవ్వలతో తక్షణమే మంటలు వ్యాపిస్తాయి.

News January 28, 2026

ఈనెల 31న ఆన్‌లైన్ జాబ్ మేళా

image

AP: పార్వతీపురం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ ఆధ్వర్యంలో జనవరి 31న ఆన్‌లైన్ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18 సంవత్సరాలు నిండిన ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైనవారు అర్హులు. రెండు కంపెనీల్లో 180 పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు. జాబ్ మేళా రిజిస్ట్రేషన్ లింక్ : https://forms.gle/vtBSqdutNxUZ2ESX8

News January 28, 2026

తెలంగాణ రెండో దేశీ విత్తన పండుగ

image

TG: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్పల్లిలోని ఎర్త్ సెంటర్లో ఫిబ్రవరి 6,7,8 తేదీల్లో తెలంగాణ రెండో దేశీ విత్తన పండుగను నిర్వహించనున్నారు. ‘భవిష్యత్ వ్యవసాయానికి దేశీ వంగడాల పరిరక్షణ అత్యంత ముఖ్యం’ అనే నినాదంతో కౌన్సెల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దేశీ విత్తన పరిరక్షకులు, రైతులు, శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.