News May 24, 2024

మణుగూరు నుంచి కోల్ కారిడార్

image

బొగ్గు గనుల ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేస్తున్న కోల్ కారిడర్ మణుగూరు నుంచి ప్రారంభం కానుంది. తాజాగా మణుగూరు – రామగుండం వరకు రైల్వే లైన్‌కు కేంద్రం పచ్చ జండా ఊపింది. ఇందుకుగాను రూ. 2,911 కోట్లు ఖర్చు చేయనుంది. మణుగూరులో ప్రారంభమయ్యే ఈ రైలు ఏటూరు నాగారం మీదుగా ములుగు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. భూపాలపల్లి నుంచి మంథని మీదుగా రామగుండం పరిధిలోని రాఘవాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.

Similar News

News March 5, 2026

ఖమ్మం:కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు

image

ఖమ్మం జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం మారి రెండేళ్లు గడుస్తున్నా, సుమారు 17 వేల మంది అర్హులు ఆశగా వేచి చూస్తున్నారు. గత మూడేళ్లుగా కొత్త దరఖాస్తులపై స్పందన లేకపోవడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనైనా తమకు ‘చేయూత’ లభిస్తుందని బాధితులు ఆశీస్తున్నారు

News March 5, 2026

ఖమ్మం: సర్కారు దవాఖానలో ‘దాహ’ మంటలు..

image

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాగునీటి ఎద్దడి రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చే వందలాది మంది రోగులు, వారి సహాయకులకు కనీసం మంచినీరు కూడా అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండలు ముదురుతుండటంతో బయట నీళ్ల బాటిళ్లు కొనలేక పేదలు అవస్థలు పడుతున్నారు. గతంలో దాతలు ఏర్పాటు చేసిన ఆర్‌ఓ (RO) ప్లాంట్ ప్రస్తుతం నిరుపయోగంగా మారడంతో ఈ దుస్థితి నెలకొంది.

News March 5, 2026

ఖమ్మం అడవుల్లో కెమెరాకు చిక్కిన చిరుత, ఎలుగుబంటి

image

ఖమ్మం జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లలో ఇటీవల చిరుతపులి, ఎలుగుబంటికి సంబంధించిన దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇది జిల్లా అటవీ పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యం ఆరోగ్యంగా ఉందనడానికి నిదర్శనమని అధికారులు తెలిపారు. వన్యప్రాణుల జనాభాను శాస్త్రీయంగా పర్యవేక్షించేందుకు, వాటి రక్షణకు అటవీ శాఖ నిరంతరం కృషి చేస్తోంది.