News May 24, 2024
కరీంనగర్: ఆదర్శలో ప్రవేశాలకు రేపటితో ముగియనున్న గడువు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మోడల్ స్కూల్స్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్లో దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నెల 10 నుంచి 25 వరకు ఆన్లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతిలో సాధించిన జీపీఏ ఆధారంగా ఉమ్మడి జిల్లాలోని 38 మోడల్ స్కూళ్లలో గ్రూపునకు 40 మంది విద్యార్థులు చొప్పున ప్రతి పాఠశాలలో 160 మంది విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు.
Similar News
News January 21, 2026
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్థానం

కరీంనగర్ మున్సిపాలిటీ 1941లో ఏర్పడి, 2005 మార్చి 5న మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది, ఇది మొదట థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా 1952లో ప్రారంభమై, 1959లో సెకండ్ గ్రేడ్, 1984లో ఫస్ట్ గ్రేడ్, 1996లో స్పెషల్ గ్రేడ్, 1999లో సెలక్షన్ గ్రేడ్ స్థాయికి చేరింది. ఇది సయ్యద్ కరీముద్దీన్ పేరు మీదుగా ఏర్పడి, ఎలగందుల నుంచి జిల్లా కేంద్రంగా మారిన తర్వాత నగర పాలక సంస్థగా విస్తరించింది.
News January 21, 2026
KNR: ‘జాతీయ ఓటరు దినోత్సవం విజయవంతం చేయాలి’

ఈనెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకల గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బూత్ స్థాయి పోలింగ్ అధికారులు వృద్ధ ఓటర్లకు సన్మానం చేయాలని పేర్కొన్నారు.
News January 20, 2026
కరీంనగర్‌లో పలువురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

మల్టీ జోన్-1 పరిధిలో పరిపాలనా కారణాలతో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ గుర్రం తిరుమల్‌ను టౌన్-III ఎస్‌హెచ్‌ఓగా, వీఆర్‌లో ఉన్న వి.పుల్లయ్యను మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. అలాగే డబ్ల్యూపీఎస్ ఇన్‌స్పెక్టర్ ఎండీ రఫీక్ ఖాన్‌ను వీఆర్‌కు, ట్రాఫిక్-II ఇన్‌స్పెక్టర్ పార్స రమేష్‌ను మందమర్రి కి బదిలీ చేశారు.


