News May 24, 2024

పల్నాడులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం

image

AP: పల్నాడు జిల్లాలో అరెస్టుల పర్వం ఇంకా కొనసాగుతోంది. పోలింగ్ రోజున విధ్వంసం కేసులో ఇప్పటివరకు దాదాపు 1000 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 400 మందిని బైండోవర్ చేశారు. 146 కేసుల్లో 1500 మందికిపైగా నిందితులను గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం ఎస్పీ మల్లికా గార్గ్ స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు చేశారు. వచ్చే నెల 4న కౌంటింగ్ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.

Similar News

News January 16, 2025

శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్: అశ్వినీ వైష్ణవ్

image

శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికల్(NGLV) ద్వారా భారీ శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఈ లాంచ్‌ప్యాడ్ ఉపయోగపడుతుందని వెల్లడించారు. అందుకు రూ.3,985 కోట్లు వెచ్చించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

News January 16, 2025

ఆసియన్ గ్రేటెస్ట్ టెస్టు XI ఇదే: స్పోర్ట్స్‌కీడా

image

ఆసియాలో 21వ శతాబ్దపు టెస్టు క్రికెట్‌లో గ్రేటెస్ట్ టెస్టు XI ఇదే అంటూ ‘స్పోర్ట్స్ కీడా’ ఓ టీమ్‌ను ప్రకటించింది. ఈ జట్టుకు జయవర్ధనే కెప్టెన్‌గా ఉన్నారు. జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, యూనిస్ ఖాన్, సచిన్ టెండూల్కర్, సంగక్కర, అశ్విన్, రంగనా హెరాత్, షోయబ్ అక్తర్, జస్ప్రిత్ బుమ్రా, ముత్తయ్య మురళీధరన్, కోహ్లీని 12వ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. టెస్టు క్రికెట్‌లో మీ టీమ్-11 ఎవరో కామెంట్ చేయండి.

News January 16, 2025

IND క్రికెటర్లు, కోచ్‌పై కఠిన ఆంక్షల వెనుక..

image

క్రికెటర్లపై BCCI <<15152483>>కఠిన ఆంక్షల<<>> వెనుక తీవ్ర కారణాలున్నట్లు TOI వెల్లడించింది. ‘AUS టూర్‌లో ప్లేయర్లు గ్రూపులుగా ట్రావెల్ చేశారు. దీంతో జట్టు బాండింగ్ మిస్సయ్యింది. ఆ మొత్తం పర్యటనలో ఒకేసారి టీమ్ డిన్నర్ జరిగింది. పలువురు తమ కుటుంబాలతో హోటళ్లలో స్టే చేస్తున్నారు. ఆఖరికి కోచ్ గంభీర్ కూడా క్రికెటర్లతో కాకుండా తన సొంత మనుషులతో బయటకు వెళ్లారు. దీంతోనే BCCI ఈ చర్యలకు దిగింది’ అని పేర్కొంది.