News May 24, 2024
60 పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ రిగ్గింగ్: YCP
AP: ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో టీడీపీ 16 నియోజకవర్గాల్లోని 60 కేంద్రాల్లో రిగ్గింగ్‌కు పాల్పడిందని వైసీపీ Xలో ఆరోపించింది. దీనిపై ఆధారాలతో సహా ఈసీకి మరోసారి ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఆయా సెంటర్లలో రీపోలింగ్ నిర్వహించాలని కోరామంది. రిగ్గింగ్ విషయంలో టీడీపీకి సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పోలింగ్ రోజే పిన్నెల్లి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని విమర్శించింది.
Similar News
News January 16, 2025
ముగిసిన కేటీఆర్ విచారణ
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటలపాటు అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
News January 16, 2025
87 మంది పిల్లలకు తండ్రి.. NEXT టార్గెట్ ప్రతి దేశంలో ఓ బిడ్డ
USకు చెందిన కైల్ గోర్డీ ప్రపంచ ప్రఖ్యాత స్పెర్మ్ డోనర్. bepregnantnow వెబ్సైట్ ద్వారా ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ దేశాల్లో 87 మంది పిల్లలకు తండ్రయ్యారు. ఈ ఏడాదిలో ఆ సంఖ్య 100కు చేరనుంది. 2026 నాటికి ప్రతి దేశంలో ఓ పిల్లాడికి తండ్రవ్వడమే లక్ష్యమని ఆయన చెబుతున్నారు. గర్భధారణ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సాయం చేయడం సంతోషంగా ఉందంటున్నారు.
News January 16, 2025
2047 నాటికి ఏపీ తలసరి ఆదాయం రూ.58.14 లక్షలు
AP: ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.68 లక్షలుగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి ఈ మొత్తం రూ.58.14 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశారు. తాము విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌కు దేశంలోనే తొలిసారి 16 లక్షల వ్యూస్ వచ్చాయన్నారు. వికసిత్ భారత్‌కు కూడా ఈస్థాయిలో స్పందన రాలేదని తెలిపారు. 2047కు 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే తమ లక్ష్యమన్నారు.