News May 24, 2024

BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లి జాతీయ రహదారిపై కాసేపటి క్రితం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దవూర మండలం ఉట్లపల్లి వాసులు పెరిక శ్రీను, కనకయ్య బైక్‌పై మల్లేపల్లి నుంచి ఇంటికి వెళ్తుండగా మరో బైక్ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందగా.. కనకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 2, 2026

నల్గొండ జిల్లాను కప్పేసిన మంచు దుప్పటి

image

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి దట్టంగా పొగ మంచు కమ్ముకుంది. ఉదయం 9 గంటల వరకు పొగ మంచు కురుస్తూనే ఉండడంతో ప్రధాన రహదారుల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్తున్నారు. గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండడం.. వాతావరణం చల్లగా ఉండడంతో అటు ప్రజలు.. ఇటు స్కూల్ చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు.

News January 2, 2026

NLG: అభ్యర్థుల ఎంపికపై పార్టీల దృష్టి

image

రిజర్వేషన్లు-నామినేషన్లకు మధ్యలో సమయం ఉండే అవకాశం లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వార్డులవారీగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్ అనుకూలించినా లేకపోయినా ముందు జాగ్రత్తగా ప్రతీవార్డుకు కులాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వార్డుల వారీగా ఆశావాహుల జాబితా రూపొందించే పనిలో పడ్డాయి

News January 1, 2026

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన నల్గొండ కొత్త కలెక్టర్

image

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఈ రోజు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ నూతన కలెక్టర్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపి, ఆల్ ది బెస్ట్ చెప్పారు.