News May 24, 2024
ఆ బస్సుల పరిస్థితేంటో..!
TG: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తుక్కు పాలసీ వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానుంది. నిబంధనల ప్రకారం 15 ఏళ్లకు మించి వయసున్న వాహనాలను తుక్కుగా పరిగణిస్తారు. ఈ ఏడాది మార్చి నాటికి TGSRTCలో 9004 బస్సులున్నాయి. వీటిలో జంటనగరాల పరిధిలో 15ఏళ్లకు పైబడిన బస్సులు 637 ఉన్నాయి. ఇక 14ఏళ్లుగా నడుస్తున్నవి 330 ఉన్నాయి. ఇప్పటికే బస్సుల కటకటతో ఉన్న TGSRTC వీటి విషయంలో ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Similar News
News January 15, 2025
ఇది వెంకీ సార్ పొంగల్: అనిల్ రావిపూడి
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వస్తున్న స్పందన ఆనందం కలిగిస్తోందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. మూవీ సక్సెస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వెంకటేశ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకోవాలో తెలుసని, ఈ సంక్రాంతికి సరిగ్గా కుదిరిందని చెప్పారు. బెనిఫిట్ షోలకు ఫ్యామిలీస్ రావడం పెద్ద అచీవ్‌మెంట్ అని తెలిపారు. ఇది వెంకీ సార్ పొంగల్ అని పేర్కొన్నారు. సినిమాకు సపోర్ట్ చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.
News January 15, 2025
ఈరోజు ప్రయాణాలు చేస్తున్నారా?
‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’ అనేది సామెత. ఇవాళ ఎలాంటి ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెబుతారు. దీనికి కారణం పూర్వం ఎడ్ల బండ్ల మీదే ప్రయాణాలు జరిగేవి. కనుమ రోజున పశువులను పూజించి ఏడాదిలో ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా బండ్లు కట్టొద్దని నిర్ణయించారు. అందుకే ఈరోజున ప్రయాణాలు చేయొద్దని అంటారు.
News January 15, 2025
ఆర్మీ డే ఇవాళే ఎందుకంటే?
భారత సైన్యాన్ని అధికారికంగా ఏప్రిల్ 1, 1895న స్థాపించారు. స్వాతంత్ర్యం తర్వాత చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ భారతదేశానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ మదప్ప కరియప్ప అనే కమాండర్‌కు ఇదే రోజున 1949లో బాధ్యతలు అప్పగించారు. దీనిని స్మరిస్తూ ప్రతి ఏటా JAN 15న ఆర్మీ డే నిర్వహిస్తున్నారు. ఈ రోజున సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వేడుకలు చేస్తారు.