News May 24, 2024
రూ.25వేల జీతంతో రూ.కోటి పొదుపు!

దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా నెలకు రూ.25వేల జీతంతోనూ రూ.కోటి పొదుపు చేయొచ్చంటున్నారు నిపుణులు. SIPలో రూ.4వేలు/నెల పొదుపు చేస్తే 12% యాన్యువల్ రిటర్న్ లెక్కన రూ.కోటి చేరేందుకు 28ఏళ్లు పడుతుంది. రూ.5వేలతో 26ఏళ్లలో, రూ.7500తో 23ఏళ్లలో, రూ.10వేలతో 20ఏళ్లలో ఆ మొత్తాన్ని చేరుకోవచ్చు. అంత మొత్తంలో పెట్టుబడి కష్టమైతే రూ.4వేల మంత్లీ SIPనే ఏటా 5% చొప్పున పెంచుకుంటూ వెళ్తే 25ఏళ్లలో లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
Similar News
News January 11, 2026
₹1లక్ష జీతంతో 764 జాబ్స్.. ఇవాళే చివరి తేదీ

DRDO 764 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B, టెక్నిషియన్-A పోస్టుల భర్తీ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు ఈ అర్ధరాత్రితో (11 JAN-26) ముగుస్తోంది. A పోస్టులకు SSC+ITI, కేటగిరీ Bకి BSc లేదా 3సం. డిప్లొమా విద్యార్హత. నెలకు ₹1లక్ష వరకు వేతనంతో పాటు HRA, TA, పిల్లల ఎడ్యుకేషన్, మెడికల్ తదితర బెనిఫిట్స్ ఉంటాయి. 18-28సం. మధ్య వయస్కులు అర్హులు. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం DRDO అధికారిక సైట్ చూడండి.
Share It
News January 11, 2026
PSLV-C62 కౌంట్‌డౌన్ స్టార్ట్

AP: తిరుపతి(D) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్-షార్‌లో PSLV-C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. రేపు ఉ.10.18 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది PSLVకి 64వ ప్రయోగం కాగా PSLV-DL వేరియంట్‌లో 5వ మిషన్. ఈ వాహక నౌక 44.4 మీటర్ల ఎత్తు, 260 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ద్వారా అధునాతన భూపరిశీలన ఉపగ్రహం EOS-N1తో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను రోదసిలోకి పంపనున్నారు.
News January 11, 2026
పసిపిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

శీతాకాలంలో పసిపిల్లలు ఎక్కువగా జలుబుకు గురవుతారు. అయితే ఈ లక్షణాలను ముందుగానే గుర్తిస్తే చికిత్స అందించడం సులువవుతుందంటున్నారు నిపుణులు. శిశువు చేతులు, కాళ్లు చల్లగా ఉండటం, చర్మం పాలిపోయినట్టు/ నీలం రంగులో కనిపించడం వంటి లక్షణాలు ఉండవచ్చు. అలాగే శ్వాస వేగంగా తీసుకోవడం, తరచుగా తుమ్మడం, ముక్కు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.


