News May 24, 2024
శ్రీకాకుళం: కౌంటింగ్ నిర్వహణకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

జూన్ 4వ తేదిన చిలకపాలెం శ్రీ శివాని ఇంజినీర్ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌లో జరగనున్న సార్వత్రిక ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు ఉండాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక అదేశించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఓట్ల కౌంటింగ్ నిర్వహణ, కౌంటింగ్ రోజున తీసుకోవలసిన చర్యలు, భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ సమీక్షించారు. అనంతరం వారికి దిశానిర్దేశం చేశారు.
Similar News
News January 13, 2026
కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించండి మహాప్రభో…!

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు, భామిని మండలాలలో అడవి ఏనుగుల సంచారంతో ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల కారణంగా తమ పంట పొలాలకు రక్షణ లేకుండా పోయిందని, ధ్వంసమైన పంటలకు నష్ట పరిహారం లభించడం లేదని ఆ ప్రాంత రైతులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పరిస్థితి తీవ్రతని గమనించి, శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల్ని రంగంలోకి దించి, అడవి ఏనుగుల్ని తమ ప్రాంతం నుండి ఒడిశా సరిహద్దులలోకి తరిమివేయాలని వారు కోరుతున్నారు.
News January 13, 2026
శ్రీశైలం మల్లన్నకు పొందూరు పాగా

శ్రీశైలం మల్లిఖార్జునస్వామికి శివరాత్రికి సమర్పించే మల్లన్న పాగాను పొందూరు చేనేత కార్మికులు సోమవారం ప్రారంభించారు. ఎంతో నైపుణ్యం కలిగిన నేతన్నలు సుమారు 41 రోజులపాటు అత్యంత నిష్టతో పాగాను నేస్తారు. ప్రతీ ఏడాది ఇక్కడి నుంచి మల్లన్నపాగా, పార్వతీదేవికి పట్టుచీరతో పాటు పలు వస్త్రాలు సమర్పిస్తారు.