News May 24, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్..పరీక్షల నోటిఫికేషన్ విడుదల

కృష్ణా వర్సిటీ పరిధిలోని పీజీ- మాస్టర్ ఆఫ్ లా(LLM) కోర్స్ 3వ సెమిస్టర్ (2023-24 విద్యా సంవత్సరం) థియరీ పరీక్షలను జూన్ 28 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీలోపు అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News November 8, 2025
కృష్ణా: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి తన నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ. 14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులు కృష్ణా జిల్లా పెడనకి చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.
News November 8, 2025
మచిలీపట్నం: కలెక్టరేట్‌లో భక్త కనకదాసు జయంతి

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాలులో భక్త కనకదాసు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య దైవంగా నిలిచిన భక్త కనకదాసు కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, యోధుడు అని తెలిపారు.
News November 8, 2025
కోడూరు: కూలికి వెళ్లి అనంత లోకాలకు..!

వ్యవసాయ కూలి పనుల వెళ్లి విగత జీవిగా యువకుడు కాటికి చేరిన సంఘటన కోడూరు మండలం గొల్లపాలెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓలేటి ఇంద్ర బాబు(27), ఇతర వ్యవసాయ కార్మికులతో ఇటీవల చిత్తూరు జిల్లా రేణిగుంట వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. శుక్రవారం వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో కరెంటు షాక్ గురై అక్కడకక్కడే మృతి చెందాడని ఇంద్రబాబు కుటుంబ సభ్యులు తెలిపారు.


