News May 24, 2024

బంగ్లాను చావు దెబ్బ కొట్టిన ఈ పేసర్ ఎవరు?

image

IPL2020 వేలంలో KKR ఓ అమెరికా పేసర్‌ను కొనడం సంచలనంగా మారిన విషయం గుర్తుందా? అతడే ఈ US బౌలర్ అలీఖాన్. బంగ్లాదేశ్‌పై అమెరికా 2-0తో T20 సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించడంలో కీలకపాత్ర పోషించారు. 2వ T20లో 3 వికెట్లు తీసి బంగ్లా టైగర్లను చావుదెబ్బ కొట్టారు. పాక్‌లో పుట్టి USకి వలస వెళ్లారు. IPLలో గాయంతో KKR‌కు ఆడకపోయినా.. ఆ ఫ్రాంచైజీ జట్లలోనే మిగతా లీగ్స్‌లో డెత్ ఓవర్ స్పెషలిస్టుగా అదరగొట్టారు.

Similar News

News January 16, 2025

‘తండేల్’ నుంచి రేపు మరో అప్డేట్

image

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ నుంచి రేపు మరో అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. మట్టికుండపై ఏదో వండుతున్నట్లుగా ఉన్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరో రుచికరమైనది రేపు ఉదయం 11.07 గంటలకు మీకు అందిస్తామని రాసుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

News January 16, 2025

కొత్త లుక్‌లో YS జగన్(PHOTO)

image

రెండో కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ ప్రదానోత్సవం కోసం లండన్‌ వెళ్లిన AP మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త లుక్‌లో కనిపించారు. రెగ్యులర్‌గా సాధారణ డ్రెస్‌లో ఉండే ఆయన అక్కడ సూటును ధరించారు. జగన్‌తో పలువురు అభిమానులు దిగిన ఫొటోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాయి. కాగా ఈ నెలాఖరు వరకు ఆయన లండన్‌లో ఉండనున్నారు. తిరిగొచ్చిన తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తారు.

News January 16, 2025

PHOTO: చంద్రబాబుతో నితీశ్ కుమార్ రెడ్డి

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా నితీశ్‌కు సీఎం రూ.25 లక్షల చెక్కును అందజేశారు. అంతర్జాతీయ గడ్డపై చరిత్ర సృష్టించి తెలుగువారు గర్వపడేలా చేశాడని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు. నితీశ్ వెంట ఆయన తండ్రితో పాటు ACA అధ్యక్షుడు ఉన్నారు.