News May 24, 2024
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడితేనే కాంగ్రెస్‌కు కనువిప్పు: హరీశ్
కాంగ్రెస్ నేతలు ఇంకెంత కాలం కేసీఆర్‌ను తిట్టుకుంటూ బతుకుతారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే నీళ్లు, కరెంట్ మాయమయ్యాయని ఆరోపించారు. ‘త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓడిస్తే తప్ప కాంగ్రెస్‌కు కనువిప్పు రాదు. ఆ పార్టీకి ఓటేయడమంటే వారి అబద్ధాలను ఆమోదించడమే. రాష్ట్రమంతా పంటలు ఎండిపోయాయి. క్రాప్ హాలిడే నెలకొంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
Similar News
News January 16, 2025
‘తండేల్’ నుంచి రేపు మరో అప్డేట్
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ నుంచి రేపు మరో అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ తెలిపారు. మట్టికుండపై ఏదో వండుతున్నట్లుగా ఉన్న కొత్త పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మరో రుచికరమైనది రేపు ఉదయం 11.07 గంటలకు మీకు అందిస్తామని రాసుకొచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
News January 16, 2025
కొత్త లుక్‌లో YS జగన్(PHOTO)
రెండో కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ ప్రదానోత్సవం కోసం లండన్ వెళ్లిన AP మాజీ సీఎం వైఎస్ జగన్ కొత్త లుక్‌లో కనిపించారు. రెగ్యులర్‌గా సాధారణ డ్రెస్‌లో ఉండే ఆయన అక్కడ సూటును ధరించారు. జగన్‌తో పలువురు అభిమానులు దిగిన ఫొటోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాయి. కాగా ఈ నెలాఖరు వరకు ఆయన లండన్‌లో ఉండనున్నారు. తిరిగొచ్చిన తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్తారు.
News January 16, 2025
PHOTO: చంద్రబాబుతో నితీశ్ కుమార్ రెడ్డి
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా నితీశ్‌కు సీఎం రూ.25 లక్షల చెక్కును అందజేశారు. అంతర్జాతీయ గడ్డపై చరిత్ర సృష్టించి తెలుగువారు గర్వపడేలా చేశాడని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులో మరింత రాణించాలని ఆకాంక్షించారు. నితీశ్ వెంట ఆయన తండ్రితో పాటు ACA అధ్యక్షుడు ఉన్నారు.