News May 25, 2024

HYD: నేడు, రేపు రైళ్లు రద్దు!

image

నేడు, రేపు పలు MMTS, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) ప్రకటించింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణ పనులు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి(FOB)ల నిర్మాణం నేపథ్యంలో సికింద్రాబాద్‌-ఫలక్‌నుమా, మేడ్చల్‌- సికింద్రాబాద్‌, లింగంపల్లి-మేడ్చల్‌, హైదరాబాద్- మేడ్చల్‌ మధ్య సేవలందించే 22 MMTS సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్‌ పీఆర్వో సీహెచ్‌.రాకేశ్‌ తెలిపారు. SHARE IT

Similar News

News January 9, 2026

HYD: RTC స్పెషల్ బస్సులు.. 50% స్పెషల్ రేట్లు

image

సిటీ నుంచి సంక్రాంతికి సొంతరు వెళ్లేందుకు నగరవాసి సిద్ధమవుతున్నాడు. అయితే ఆర్టీసీ ప్రత్యేకంగా నడుపుతున్న బస్సుల్లో టికెట్లకు స్పెషల్ రేట్లు ఉంటాయి. అంటే అదనంగా 50% వసూలు చేస్తారన్నమాట. పండగ సమయాల్లో అదనపు ఛార్జీ వసూలుకు సంబంధించి గతంలోనే ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో 50 జారీ చేసింది. ఈ మేరకే ప్రత్యేక దిన్నాల్లో RTC స్పెషల్ రేట్స్ అమలు చేస్తుంది. అయినా.. అవసరం ప్రజలది.. అవకాశం పాలకులది కదా.

News January 9, 2026

హైదరాబాద్‌ కోసం ‘గోదావరి’ రెడీ

image

నగరవాసులకు నీళ్ల కష్టాలు తీరబోతున్నాయి. హైదరాబాదీల దాహం తీర్చడంతో పాటు మూసీకి పూర్వవైభవం తెచ్చేందుకు జలమండలి రూ. 7,360 కోట్లతో చేపట్టిన గోదావరి ఫేజ్-2, 3 పనులపై ఎండీ అశోక్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మల్లన్నసాగర్ నుంచి వచ్చే 20 టీఎంసీల నీటితో నగరం కళకళలాడనుంది. 2027 డిసెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేసి, 300 ఎంజీడీల నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
SHARE IT

News January 9, 2026

HYDలో ఈ వీకెండ్ ఇదే బెస్ట్ ప్లేస్!

image

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇప్పుడు ఒక కలర్ ఫుల్ డెస్టినేషన్. JAN 11 వరకు సాగే ఉద్యాన ఉత్సవ్-2026లో అరుదైన మూలికా వనాలు, నక్షత్ర వాటికలతో పాటు రాత్రివేళ మ్యూజికల్ ఫౌంటెన్ షో ఒక రేంజ్‌లో ఉంటోంది. అచ్చం ఫారిన్ లొకేషన్ ఫీలింగ్ ఇచ్చే ఈ పచ్చదనం మధ్య సెల్ఫీలు అదిరిపోతాయి. ప్రవేశం ఉచితం. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు చూడొచ్చు. ఐడీ కార్డుతో ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.
SHARE IT