News May 25, 2024
టీ20 వరల్డ్ కప్ కామెంటేటర్లలో డీకేకు చోటు

టీ20 వరల్డ్ కప్ కామెంటేటర్ల జాబితాను ఐసీసీ ప్రకటించింది. 41 మంది సభ్యులున్న ఈ ప్యానెల్‌లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ దేశాలకు చెందిన దిగ్గజాలు ఉన్నారు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, దినేశ్ కార్తీక్, హర్ష, పాంటింగ్, వసీం అక్రమ్, స్టీవ్ స్మిత్ వంటి వారు ఉన్నారు. కాగా డీకే ఇటీవలే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన గతంలో WC 2023, యాషెస్ సిరీస్‌లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
Similar News
News November 7, 2025
సోషల్ జస్టిస్& ఎంపవర్‌మెంట్‌లో 49 ఉద్యోగాలు

<
News November 7, 2025
జీపీఎస్ స్పూఫింగ్ అంటే?

GPS స్పూఫింగ్ అనేది ఒక సైబర్ అటాక్. GPS సిగ్నల్‌లను మానిప్యులేట్ చేసి నావిగేషన్ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తారు. ఇలా ఫేక్ శాటిలైట్ సిగ్నల్‌లను ప్రసారం చేయడంతో విమానాలు ఫాల్స్ రూట్లలో వెళ్లే అవకాశముంది. ఓ చోట ఉన్న ఫ్లైట్ మరో చోట ఉన్నట్లు చూపిస్తుంది. దీని వల్ల ఫ్లైట్స్ టేకాఫ్/ల్యాండింగ్ అయ్యేటప్పుడూ ప్రమాదాలకు ఆస్కారముంటుంది. <<18227103>>ఢిల్లీ<<>>, ముంబైలో విమాన సేవల అంతరాయానికి ఇదే కారణమనే అనుమానాలున్నాయి.
News November 7, 2025
ప్రేమికుడిపై కక్షతో ఫేక్ మెయిల్స్… చివరకు జైలు

ప్రేమ విఫలమైన ఓ యువతి ప్రేమికుడి పేరిట ఫేక్ బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి కటకటాల పాలైంది. రోబోటిక్ ఇంజినీర్ రెనా జోషిల్డా(గుజరాత్) ప్రభాకర్ అనే సహచరుడిని ప్రేమించింది. అయితే ఆయన మరో పెళ్లి చేసుకోగా కక్షగట్టింది. ఆయన వర్చువల్ నంబర్‌తో అనేక రాష్ట్రాల స్కూళ్లు, కోర్టులు, స్టేడియాల్ని పేల్చేస్తున్నట్లు రెనా మెయిల్స్ పంపింది. 21 ప్రాంతాల్లో పోలీసులను పరుగులు పెట్టించి చివరకు బెంగళూరులో అరెస్టైంది.


