News May 25, 2024
జూన్ 4 టెన్షన్.. ఏపీవ్యాప్తంగా తనిఖీలు

AP: ఓట్ల లెక్కింపు జరిగే జూన్4న అల్లరు చెలరేగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో ఏపీవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు సహా అనుమానిత ప్రదేశాల్లో కార్డెన్ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. అక్రమ ఆయుధాలు, గుర్తింపు లేని వాహనాలు, పేలుడు పదార్థాలు వంటివి గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 24కేసులు నమోదు చేసి పలువురిని అరెస్ట్ చేశారు.
Similar News
News January 10, 2026
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల హౌసింగ్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంతో పాటు స్వయం సహాయక సంఘాల కుటుంబాలకు స్థిరమైన ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేయాలని వరంగల్ కలెక్టర్ డా.సత్య శారద అన్నారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. జడ్పీ సీఈవో, ఇన్ ఛార్జ్ డీఆర్డీఓ రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
News January 10, 2026
చిన్నస్వామి స్టేడియంలో RCB మ్యాచ్‌లు లేనట్టే?

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో 2026 IPL మ్యాచ్‌ల నిర్వహణపై క్లారిటీ రావడం లేదు. ఇక్కడ మ్యాచ్‌ల గురించి RCB ఇప్పటివరకు KSCAతో చర్చించలేదు. కోహ్లీతోపాటు ఇతర ప్లేయర్ల భద్రత దృష్ట్యా గత ఏడాది ఈ గ్రౌండ్‌లో జరగాల్సిన డొమెస్టిక్ మ్యాచ్‌లను రాయ్‌పూర్‌కు తరలించారు. 2025 ట్రోఫీ <<16602800>>సెలబ్రేషన్స్‌లో జరిగిన తొక్కిసలాటలో<<>> 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ స్టేడియంలో RCB మ్యాచ్‌లు ఆడే అవకాశం లేనట్టే.
News January 9, 2026
వెనిజులాపై మరో దాడి అక్కర్లేదు: ట్రంప్

వెనిజులాలో పొలిటికల్ ప్రిజనర్స్‌ను విడుదల చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. ‘వాళ్లు శాంతిని కాంక్షిస్తున్నారన్న విషయం అర్థమవుతోంది. ఆయిల్, గ్యాస్ స్ట్రక్చర్‌ను రీబిల్ట్ చేయడంలో US, వెనిజులా కలిసి పనిచేస్తున్నాయి. ఈ సహకారం వల్లే నేను గతంలో ప్లాన్ చేసిన రెండో దఫా దాడులను రద్దు చేశాను. దాని అవసరం రాదు. కానీ రక్షణ కోసం అన్ని నౌకలు అక్కడే ఉంటాయి’ అని తెలిపారు.


