News May 25, 2024

RESULTS: ముందు 21.. రీవెరిఫికేషన్‌లో 91 మార్కులు

image

TG: ఇంటర్ మూల్యాంకనంలో కొందరు లెక్చరర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. భాషా సబ్జెక్టులో ఓ విద్యార్థికి తొలుత 21 మార్కులు రాగా.. రీవెరిఫికేషన్‌లో ఏకంగా 91 మార్కులొచ్చాయి. అలాగే కామర్స్‌లో 77 మార్కులు వచ్చిన ఓ విద్యార్థిని జవాబుపత్రం డౌన్‌లోడ్ చేసుకుని చెక్ చేయగా.. తొలుత 97 మార్కులు వేసి, ఆ తర్వాత 77కు మార్చినట్లు ఉంది. ఇంటర్ బోర్డుకు విద్యార్థులు ఫిర్యాదులు చేస్తున్నారు.

Similar News

News April 4, 2026

ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. ఆ గ్రామాల్లో ఐస్‌క్రీమ్ బండ్లు నిషేధం!

image

TG: ఐస్‌క్రీమ్ కల్తీ నుంచి పిల్లలను కాపాడేందుకు నిజామాబాద్ జిల్లాలోని 3 గ్రామాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఐస్‌క్రీమ్ బండ్ల ప్రవేశాన్ని నిషేధించాయి. ఆర్మూర్(M) అంకాపూర్, జక్రాన్‌పల్లి(M) కొలిపాక, వేల్పూర్(M) అంక్సాపూర్ గ్రామాలు దీనిపై తీర్మానం చేశాయి. నిబంధన ఉల్లంఘిస్తే ₹5వేల జరిమానా విధిస్తామని ప్రకటించాయి. ఫుడ్ సేఫ్టీ రైడ్స్‌లో ఐస్‌క్రీమ్ కల్తీలు బయటపడటంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.

News April 4, 2026

గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్‌కూ షూ, బెల్ట్

image

TG: గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకూ షూ, బెల్ట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఇస్తున్న యూనిఫామ్, నోట్ బుక్స్, పుస్తకాలకు ఇవి అదనం. వీటితో పాటు కొత్తగా బెల్ట్, బ్లాక్ షూ, రెండు జతల సాక్సులను జూన్ 12 నుంచే అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు KGBV, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్, మోడల్ స్కూల్ హాస్టల్ విద్యార్థులకు ఎలాంటి వ్యత్యాసం లేకుండా 18రకాల వస్తువులు ఇవ్వనున్నారు.

News April 4, 2026

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్.. ఈ నెల 10 వరకు గడువు

image

ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 10 వరకు గడువుంది. 17.5-21 ఏళ్ల వయసున్న అవివాహితులు అర్హులు. నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్ డ్యూటీకి టెన్త్‌లో 45%, అగ్నివీర్ టెక్నికల్(MPC)/క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు 12thలో 60% మార్కులు వచ్చి ఉండాలి. అప్లికేషన్ ఫీజు ₹250. మరిన్ని వివరాలకు joinindianarmy.nic.in చూడండి.