News May 25, 2024

HYD: స్నాప్‌ చాట్‌లో నకిలీ ID.. రూ.14 లక్షల వసూలు

image

ఓ యువకుడు అమ్మాయి పేరిట డబ్బులు కాజేశాడు. సైబర్‌ క్రైం ACP బి.రవీందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. నగరానికి చెందిన మారం అశోక్‌రెడ్డి(23) స్నాప్‌ చాట్‌లో ప్రణీతరెడ్డి పేరిట నకిలీ ID సృష్టించాడు. అందమైన యువతి ప్రొఫైల్‌ ఫొటో పెట్టి పలువురికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. తర్వాత ప్రేమ, పెళ్లి పేరిట వారికి గాలమేసేవాడు. అలా రూ.14 లక్షలు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

Similar News

News September 30, 2024

HYD: దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులు: వీసీ సజ్జనార్

image

దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీన‌గ‌ర్, ఉప్ప‌ల్, ఆరాంఘ‌ర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ, రూట్‌ల నుంచి స్పెష‌ల్ స‌ర్వీసులను అందుబాటులో తీసుకొస్తామన్నారు. ముందస్తు రిజర్వేషన్ కోసం సంస్థ అధికారిక వెబ్ సైట్ tgsrtbus.in.ని సమాచారం కోసం త‌మ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాల‌న్నారు.

News September 30, 2024

HYD: మూసీ నిర్వాసితులపై BRS మొసలి కన్నీళ్లు: మంత్రి

image

మూసీ నిర్వాసితులపై బీఆర్ఎస్ వాళ్లు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా అంశాన్ని బీఆర్ఎస్ భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గతంలో రైతు సోదరులపై బుల్డోజర్లు పంపించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మండిపడ్డారు. మూసీ నిర్వాసితులకు తాము అండగా ఉంటామని, HYDను బెస్ట్ సిటీగా మారుస్తామని స్పష్టం చేశారు.

News September 30, 2024

HYD: రూ.35 కోట్లతో చర్లపల్లికి మహర్దశ

image

HYD చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో రోడ్ల అభివృద్ధికి రంగం సిద్ధమైంది. GHMC రైల్వే స్టేషన్ వద్ద 3 ప్రధాన ద్వారాలు నిర్మించాలని నిర్ణయించింది. 100, 28 అడుగుల వెడల్పుతో 2 ద్వారాలు నిర్మిస్తారు. వీటిని 100 అడుగుల రోడ్డుతో జత చేస్తారు. పార్కింగ్ కేంద్రాలు, బస్టాండ్, ఆటోస్టాండ్ వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. రూ.35 కోట్లతో కొత్త రోడ్లు వేయనున్నారు.