News May 25, 2024
గుంటూరు: పలు రైళ్లు 30 రోజులు రద్దు

ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున పలు రైళ్లను రద్దు చేసినట్లు మండల రైల్వే అధికారి శుక్రవారం తెలిపారు. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు గుంటూరు-డోన్ (17228), హుబ్లీ-విజయవాడ (17329), కాచిగూడ- నడికుడి- కాచిగూడ (07791/07792) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. వచ్చే నెల 1 నుంచి జులై 1వ తేదీ వరకు డోన్-గుంటూరు (17227), జూన్ 2 నుంచి జులై 1వ తేదీ వరకు విజయవాడ-హుబ్లీ(17330) రైళ్లు నడవవని పేర్కొన్నారు.
Similar News
News January 10, 2026
GNT: మధ్యాహ్నం టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలెప్‌మెంట్‌పై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ప్రజలు కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News January 10, 2026
GNT: ప్రముఖ జర్నలిస్ట్, రచయిత డి. ఆంజనేయులు

జర్నలిస్ట్ ధూళిపూడి ఆంజనేయులు (డి.ఎ) సాహితీ లోకానికి చిరపరిచితులు. గుంటూరు జిల్లా యలవర్రులో 1924 జనవరి 10న జన్మించిన ఆయన, ది హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి పత్రికల్లో పనిచేశారు. ఆకాశవాణి ‘వాణి’ పత్రికకు సంపాదకత్వం వహించారు. తెలుగు సాహిత్యాన్ని, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితలను ఆంగ్లంలోకి అనువదించి ఇతర ప్రాంతాల వారికి పరిచయం చేశారు. కందుకూరి, సి.ఆర్.రెడ్డి జీవిత చరిత్రలు రచనలు చేశారు.
News January 10, 2026
తెనాలిలో అర్ధరాత్రి ఏసీ మెకానిక్ దారుణ హత్య

తెనాలి నందులపేటకు చెందిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్(52) హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి తెనాలి టీచర్స్ కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని దుండగులు ఫయాజ్‌ను కొట్టి చంపి పడవేశారు. స్థానికులు గుర్తించి అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో కర్రలు, రాడ్లు ఉన్నట్లు గుర్తించారు. సీఐ సాంబశివరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.


