News May 25, 2024
వరంగల్: ‘అమ్మ నేను చనిపోతున్నా.. నాకోసం వెతకొద్దు’

‘అమ్మ నేను చనిపోతున్నా.. నాకోసం వెతకొద్దు’ అని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన కొద్ది నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన ఓ మైనర్ హంటర్ రోడ్డు సమీపంలో 2 మోరీల జంక్షన్ వద్ద రైలు కింద పడి మృతి చెందింది. ఓ బాలికకు వరంగల్ కాశిబుగ్గకు చెందిన చెన్నకేశవ మధ్య ఫోన్ కాల్ ద్వారా బంధం ఏర్పడింది. ఇద్దరూ మైనర్లు కావడంతో ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమనే చర్చ జరుగుతుంది.
Similar News
News March 14, 2025
వరంగల్: నగర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మేయర్

హోలీ పండుగ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రత్యేకంగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను ఆనందంతో సంతోషంగా జరుపుకోవాలని మేయర్ ఆకాంక్షించారు.
News March 14, 2025
వరంగల్: హోలీ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

హోలీ పండుగను పురస్కరించుకొని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద జిల్లా ప్రజలకు హోలీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందర్నీ ఒకటి చేసే ఈ హోలీ పండుగ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషంతో వెలుగులో నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనంద ఉత్సాహాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని అన్నారు. సహజ రంగులను వినియోగిస్తూ సాంప్రదాయబద్ధంగా పోలి నిర్మించుకోవాలని కలెక్టర్ కోరారు.
News March 14, 2025
WGL: బాల్యంలో ఈ పూలతోనే హోలీ (PHOTO)

వరంగల్ల్లో ఓ చెట్టుకు విరబూసిన పూలు మన బాల్యాన్ని గుర్తుచేస్తున్నాయి. ఒంటిపూట బడికెళ్తుంటే రోడ్డు పక్కనే ఇవి గుబాలించేవి. ఈ పూల మకరందం రుచిచూసి మైమరచిన బాల్యం మళ్లీ గుర్తొస్తోంది. పండగొస్తుంది అనే సంబరంలో ఎండలో తిరిగి ఈ పూలను ఒకరోజు ముందే సేకరించేవాళ్లం. నీటిలో ఉడికించి రంగు ఊరిన నీళ్లతో ఆడిన హోలీ బాల్యంలో ఓ మధురజ్ఞాపకమే. ఈ ఏడాదైనా మోదుగ పూలతో హోలీ జరుపుకోండి. HAPPY HOLI