News May 25, 2024

ఐటీ ఉద్యోగాల్లో HYDదే హవా

image

TG: ఆర్థిక మందగమనం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల తొలగింపు జరుగుతుంటే హైదరాబాద్‌లో మాత్రం నియామకాల్లో పురోగతి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్త పోస్టింగుల్లో 3.6 శాతం తగ్గుదల నమోదుకాగా, భాగ్యనగరంలో 41.5 శాతం వృద్ధి నమోదు కావడం విశేషం. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఐటీ నియామకాలపై అధ్యయనం చేసి ‘ఇండీడ్’ ఈ వివరాలను వెల్లడించింది. బెంగళూరులో పెరుగుదల 24 శాతమే కావడం గమనార్హం.

Similar News

News January 17, 2025

సింగపూర్‌ వెళ్లిన సీఎం.. అటు నుంచే దావోస్‌కు

image

ఢిల్లీలో కేంద్రమంత్రులతో భేటీ తర్వాత నిన్న రాత్రి TG సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ బయల్దేరారు. మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందం ఆయన వెంట వెళ్లింది. మూడు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం పెట్టుబడుల విషయమై చర్చించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరమ్‌లో పాల్గొనేందుకు దావోస్ వెళ్తారు. గత పర్యటనలో ప్రభుత్వం రూ.40వేల కోట్ల పెట్టుబడులు సమీకరించింది.

News January 17, 2025

VIRAL: ఇదేందయ్యా ఇది.. స్టూడెంట్ మూవీ రివ్యూ చూశారా?

image

సాధారణంగా స్కూళ్లలో విద్యార్థులకు సినిమాలకు సంబంధించి హీరో, హీరోయిన్, దర్శకుడు ఎవరనే విషయాల్లో ప్రశ్నలు అడుగుతారు. కానీ తన కజిన్‌కు మూవీ రివ్యూను హోంవర్క్‌గా ఇచ్చినట్లుగా ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. సలార్ మూవీకి విద్యార్థికి రివ్యూ ఇవ్వగా మా టైమ్‌లో ఇలాంటి హోమ్ వర్క్ ఉంటే బాగుండేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సలార్ క్రేజీ ఇంకా కొనసాగుతోందని మరికొందరు పోస్టులు చేస్తున్నారు.

News January 17, 2025

రూ.446 కోట్ల పెండింగ్ బిల్లులు రిలీజ్

image

TG: సీఎం రేవంత్ ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖలో రూ.446 కోట్ల పెండింగ్ బకాయిలను ఆర్థిక శాఖ విడుదల చేసింది. వీటిలో రూ.300 కోట్ల ఉపాధి హామీల పనుల బిల్లులు, రూ.146 పారిశుద్ద్య కార్మికుల వేతనాలకు చెల్లించనున్నారు. త్వరలోనే మరిన్ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ-కుబేర్ ద్వారా పారిశుద్ద్య కార్మికుల వేతనాలు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.